E-Paper
Advertisement

Cockroach Control: ఇంట్లో కాక్రోచ్‌ల బెడదతో విసిగిపోయారా? ఇలా చేస్తే ఇల్లంతా క్లీన్

Cockroach Control: ఇంట్లో కాక్రోచ్‌ల బెడదతో విసిగిపోయారా? ఇలా చేస్తే ఇల్లంతా క్లీన్
Advertisement

Cockroach Control | ఇంట్లో రాత్రివేళ వంటగదిని శుభ్రం చేసి నిద్రపోతారు. ఉదయం లేవగానే కిచెన్‌లో మళ్లీ కాక్రోచ్‌లు (బొద్దింకలు) తిరుగుతుంటే అక్కడ పనిచేయడానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ సమస్య మీ ఇంట్లోనే కాదు దాదాపు అన్ని ఇళ్లలో కనిపిస్తుంది. శుభ్రంగా ఉన్న ఇంట్లో కూడా బొద్దింక పురుగులు వస్తాయి. ఇంటి ఫ్లోర్‌లో ఉన్న చిన్న పగుళ్లు, పైపుల గుండా, మురికి ప్రాంతాల నుంచి కాక్రోచ్‌లు వస్తుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే త్వరగా పెరిగిపోతాయి. ఆహారం, వంటగది సామగ్రిని కలుషితం చేస్తాయి. దీంతో ఆరోగ్య సమస్యలు, ఇన్‌ఫెక్షన్, వ్యాధులు వచ్చే ప్రమాదముంది.

బొద్దింకలు ఆరోగ్యానికి ఎందుకు హానికరం?

బొద్దింకలు చూడటానికి అసహ్యంగా ఉండటమే కాదు. వీటితోపాటు హానికరమైన బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వస్తాయి. చెత్త, డ్రైనేజీ, మురికి ప్రాంతాల్లో తిరిగి ఆహారం, పాత్రల మీద నడుస్తాయి. దీని వల్ల ఆహారం కలుషితమై, ఇన్ఫెక్షన్లు, కడుపునొప్పి లాంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి అలర్జీలు, శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం కోసం, పరిశుభ్రమైన ఇంటి కోసం వీటిని దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.

కెమికల్స్ లేని సహజ నివారణ పద్ధతులు

Advertisement

కాక్రోచ్‌లు తొలగించడానికి మార్కెట్‌లో లభించే కెమికల్స్ కంటే సహజ పద్ధతులు ఎంతో బెటర్. ఇవి సురక్షితం, చవకగా ఉంటాయి.

బేకింగ్ సోడా, చక్కెర మిక్స్ చేసిన పౌడర్

బేకింగ్ సోడా, పొడి చక్కెర సమాన మొత్తంలో కలపండి. బొద్దింకలు ఎక్కువగా కనిపించే చోట ఈ పౌడర్ ఉంచండి. చక్కెర వాటిని ఆకర్షిస్తుంది, బేకింగ్ సోడా వాటికి హాని చేస్తుంది. ఇది తినగానే బొద్దింకలు క్రమంగా చనిపోతాయి. ఈ పద్ధతి వాటి సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

బిర్యానీ ఆకులు (బే లీవ్స్)

Advertisement

కాక్రోచ్‌లు.. బిర్యానీ ఆకుల (లవంగం ఆకు) నుంచి వెలువడే ఘాటు వాసనని ఇష్టపడవు. ఈ ఆకులను చూర్ణం చేసి వంటగది మూలల్లో, సింక్, అలమారాలు, స్టోర్ రూంలలో ఉంచండి. దీంతో కాక్రోచ్‌లు అక్కడి నుంచి దూరమైపోతాయి.

వేప నూనె లేదా వేప నీరు

వేపాకులో బలమైన క్రిమి నిరోధక లక్షణాలు ఉన్నాయి. రాత్రి వేళ కాక్రోచ్‌లు ఉన్న ప్రాంతాల్లో వేప నూనె స్ప్రే చేయండి. లేదా వేప నీటితో అంతా తుడవండి. దీంతో బొద్దింకలు అక్కడి నుంచి వెళ్లిపోతాయి.

లవంగం వాసన

అందరి ఇళ్లలో లవంగంలో ఉండే ఘాటు వాసనకు కాక్రోచ్‌లు దూరంగా ఉంటాయి. వంటగది డ్రాయర్లు, ఇతర స్టోరేజ్ ప్రాంతాల్లో లవంగాలు ఉంచండి. దీంతో బొద్దింకలు దూరమైపోయి, తేలికపాటి సువాసన కూడా ఉంటుంది.

బొద్దింకలు మళ్లీ రాకుండా ఉండాలంటే

బొద్దింకలు ఇంట్లో వచ్చాక వాటిని తొలగించడం కంటే అవి రాకుండా నివారించడం మంచిది. దీని కోసం సాధారణ అలవాట్లు పాటించండి.

Also Read: యవ్వనంలోనే ముసలితనం ఛాయలు.. దేశంలో పెరుగుతున్న సమస్య.. ధృడమైన శరీరం కోసం ఈ టిప్స్

రాత్రి వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా, తడి లేకుండా ఉంచండి.

  • రాత్రివేళ సింక్‌లో మురికి పాత్రలు ఉండకూడదు. అన్ని శుభ్రం చేయాలి.
  • కిచెన్‌లో, ఇంటి ఏ ఇతర ప్రదేశంలోనైనా ఆహారం ముక్కలు, నేలపై నీరు కారి ఉన్నా.. వెంటనే శుభ్రం చేయండి.
  • చెత్తకుండీని ఎప్పుడూ మూసి ఉంచండి.
  • గోడలు, టైల్స్‌లోని పగులు, గ్యాప్‌లను మూసివేయండి.
  • లీక్ అయ్యే పైపులను సరిచేసి, తేమ పేరుకుపోకుండా చూడండి.

బొద్దింకలను నిర్లక్ష్యం చేస్తే ఇంటి శుభ్రత, ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. సహజ నివారణ పద్ధతుల్లో వాటిని నియంత్రించడానికి సహాయపడతాయి. మంచి అలవాట్లు పాటిస్తే మళ్లీ రాకుండా ఉంటాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×