E-Paper
Advertisement

ఈ లక్షణాలు కనిపిస్తే మీ పిల్లాడిలో మొండితనం ఉన్నట్లే.. తల్లిదండ్రులు ఇవి తెలుసుకోవాలి

ఈ లక్షణాలు కనిపిస్తే మీ పిల్లాడిలో మొండితనం ఉన్నట్లే.. తల్లిదండ్రులు ఇవి తెలుసుకోవాలి
Advertisement

Stubborn Kids Qualities| కొంతమంది పిల్లలు చిన్న వయసు నుంచే అన్నీ తాము కోరుకున్నట్లుగానే జరగాలని ప్రవర్తిస్తారు. దీన్ని సాధారణంగా “పట్టుదల” లేదా “మొండితనం” అంటారు. కానీ ఇలా చేయడం విధేయత లేకపోవడం అని అర్థం కాదు. కొన్నిసార్లు ఇది వారి వ్యక్తిత్వం లేదా భావోద్వేగాల నుంచి వస్తుంది. ఈ సంకేతాలను ముందుగా గుర్తించడం వల్ల తల్లిదండ్రులు పిల్లాడిలో మొండితనాన్ని తగ్గించవచ్చు.

1. సూచనలు పాటించడానికి నిరాకరించడం

Advertisement

మొండితనంతో ప్రవర్తించే పిల్లలు.. తల్లిదండ్రులు ఇచ్చే చిన్న చిన్న సూచనలకు కూడా “లేదు” అని చెబుతారు. వారు తమ సొంత నిర్ణయాన్ని మాత్రమే అమలు చేయాలని, అంటే తాము ఇష్టపడిందే, కోరుకున్నట్లుగానే జరగాలని అంటారు. ఇలా చేయడం తల్లిదండ్రుల అధికారానికి వ్యతిరేకత చూపిస్తుంది.

2. తరచూ ఆగ్రహం వ్యక్తం చేయడం

మొండిగా ఉండే పిల్లలు తరచూ అల్లరి చేస్తారు, ఏడుస్తారు, అరుస్తారు లేదా కోపం చూపిస్తారు. ఏ విషయమైనా తమ ఇష్టం ప్రకారం జరగకపోతే ఈ ప్రవర్తన కనిపిస్తుంది.

3. ప్రతిదీ తన ఇష్టం ప్రకారం చేయాలనుకోవడం

Advertisement

మొండితనం అలవర్చుకునే పిల్లలు పనులు తమ విధంగా చేయాలని ఆశిస్తారు. తల్లిదండ్రుల సహాయం లేదా సలహాలను తిరస్కరిస్తారు. తాము స్వతంత్ర్యగా ఉండాలనే వారి కోరికను చూపిస్తుంది.

4. ఎక్కువగా వాదించడం

ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులు లేదా పెద్దలతో తరచూ వాదిస్తారు. తమ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తారు. ఇతరుల అభిప్రాయాలను సులభంగా అంగీకరించరు.

5. నియమాలు, హద్దులను పట్టించుకోకపోవడం

తల్లిదండ్రులు పెట్టిన నియమాలను వారు పదే పదే అతిక్రమిస్తారు. ఇది తమ నియంత్రణ కోసం వారి ప్రయత్నాన్ని చూపిస్తుంది.

6. పనులు పూర్తి చేయడంలో ఆలస్యం చేయడం

కొంతమంది పిల్లలు ఉద్దేశపూర్వకంగా పనులు ఆలస్యం చేస్తారు. ఇది సోమరితనం లాగా అనిపించినా, వాస్తవానికి ఒత్తిడి లేదా భయం వల్ల కావచ్చు.

7. త్వరగా నిరాశ చెందడం

కష్టమైన పనులు వచ్చినప్పుడు.. మొండిగా ఉండే పిల్లలు త్వరగా ఓపిక కోల్పోతారు. ప్రయత్నం చేయడం మానేసి, కోపం చేస్తారు లేదా తాము కోరుకున్నది జరగలేదని నిరాశ చెందుతారు.

8. నచ్చిన విషయాలు మాత్రమే వినడం

తమకు నచ్చిన విషయాలు మాత్రమే మొండి పిల్లలు వింటారు. వారికి ఆసక్తి లేని సూచనలను విస్మరిస్తారు.

9. చిన్న వయసులోనే బలమైన అభిప్రాయాలు

వారు చిన్న వయసులోనే బలమైన అభిప్రాయాలు ఏర్పరచుకుని, వాటిని బలంగా వ్యక్తం చేస్తారు. ఇతరులు తమతో ఏకీభవించాలని కోరుకుంటారు.

Also Read:  తల్లిదండ్రులు మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు.. పిల్లలను ప్రయోజకులుగా చేయడానికి ఇవి చాలా అవసరం

10. ఇష్టం లేని పనులను ఎడాపెడా నివారించడం

కష్టమైన లేదా బోరింగ్‌గా అనిపించే పనులను తప్పించుకోవడానికి మొండితనం ఉన్న పిల్లలు ఎక్కువ సాకులు చెబుతారు.

తల్లిదండ్రులు ముందుగా అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం?

ఈ పిల్లాడు “మొండి” అని లేబుల్ వేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలను దెబ్బతీస్తుంది. చాలా సార్లు పిల్లలు ఉద్దేశపూర్వకంగా ఇలా చేయరు. ఏది చేయాలి? ఏది చేయకూడదో మానసికంగా ఘర్షణ పడుతుంటారు. అందుకే తల్లిదండ్రులు వారి ప్రవర్తన వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారిపై పరిసరాల ప్రభావం కూడా ఉండవచ్చు.

పిల్లల మొండి ప్రవర్తనకు అనేక కారణాలు ఉండవచ్చు. ఇది వ్యక్తిత్వం, భావోద్వేగాలు లేదా పరిసరాల నుంచి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఓపికగా, ప్రేమతో.. అర్థం చేసుకునే దృక్పథంతో వ్యవహరించాలి. ముందస్తు మార్గదర్శకత్వం చేయడం వల్ల పిల్లలు సానుకూలంగా అభివృద్ధి చెందుతారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×