E-Paper
Advertisement

Clove Water: వారం రోజులు లవంగం నీరు తాగితే మీ శరీరంలో ఊహించని మార్పులు

Clove Water: వారం రోజులు లవంగం నీరు తాగితే మీ శరీరంలో ఊహించని మార్పులు
Advertisement

లవంగం నీరు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని తాగితే శరీరంలో అద్భుత మార్పులు కలుగుతాయి. లవంగాలు ప్రతి ఇంట్లోను ఉంటాయి. దీన్ని సాధారణంగా మనం వంటల్లో రుచికోసం వాడుతుంటాం. లవంగాల్లో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం కేవలం 7 రోజులు వరుసగా లవంగం నీరు తాగితే శరీరానికి, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.

లవంగంలో ఉండే నూనె
లవంగం ఒక సుగంధ ద్రవ్యం. దీనిలో యూజెనాల్ అనే సహజ నూనె ఉంటుంది. ఇది శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది. లవంగంలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటంతో శరీరానికి శక్తినిస్తుంది, చర్మానికి కాంతిని ఇస్తుంది. రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో 4 లేదా 5 లవంగాలు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని కొద్దిగా వేడి చేసి తాగాలి. ఖాళీ కడుపుతో తాగితే ఇంకా మంచిది. అయితే ఎవరికైనా కడుపులో మంట సమస్య ఉంటే భోజనం తర్వాత కూడా తాగవచ్చు.

Advertisement

మీలో కనిపించే మార్పులు ఇవిగో
లవంగం నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి కొత్త కణాలను పుట్టిస్తాయి. దీని వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. లవంగం నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తాయి. దీని వల్ల మొటిమలు, చర్మపు సమస్యలు తగ్గుతాయి. లవంగం నీరు కడుపులో గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. లవంగం నీటిలో ఉన్న పోషకాలు ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరుస్తాయి. దీని వల్ల సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు రాకుండా ఉంటుంది.

కాలేయం కోసం తాగండి
లవంగం లివర్‌లో ఉన్న హానికర పదార్థాలను తొలగిస్తుంది. దీని వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. లవంగం నీరు రక్తంలో చక్కెర స్థాయిలను సరిగా ఉంచడంలో సహాయపడుతుంది. లవంగం సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నోటిలో ఉన్న బ్యాక్టీరియాను చంపి దుర్వాసనను తగ్గిస్తాయి. లవంగం నూనెలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.

Advertisement

ఈ జాగ్రత్తలు తప్పవు
రోజుకు ఒక గ్లాస్ కంటే ఎక్కువ లవంగం నీరు తాగకూడదు.
వారం రోజుల తర్వాత 2–3 రోజుల విరామం ఇవ్వడం మంచిది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు వైద్యుల సలహా లేకుండా తాగకూడదు. అల్సర్, గ్యాస్ట్రిక్, రక్తస్రావ సమస్యలున్నవారు దూరంగా ఉండాలి. ఎక్కువ మోతాదులో లవంగం తీసుకోవడం లివర్‌కు హాని కలిగించవచ్చు.

ప్రకృతిలో దొరికే పదార్థాలలోనే మన ఆరోగ్యానికి అద్భుతమైన పరిష్కారాలు దాగి ఉంటాయి. వాటిలో లవంగం ఒకటి. రోజుకు ఒక గ్లాస్ లవంగం నీరు తాగడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఈ నీటిని మితంగా తీసుకోవాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×