E-Paper
Advertisement

OPT program: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో షాకింగ్ న్యూస్.. ఓపీటీ ప్రొగ్రామ్‌పై కీలక ప్రతిపాదన

OPT program: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో షాకింగ్ న్యూస్.. ఓపీటీ ప్రొగ్రామ్‌పై కీలక ప్రతిపాదన
Advertisement

OPT program: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ఎన్నికైన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. ముఖ్యంగా విదేశీ విద్యార్థుల రాకకు సంబంధించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశంపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ‘సోషల్ వెట్టింగ్’ వంటి విధానాలతో విదేశీ విద్యార్థుల అమెరికా కలను గందరగోళంలో పడేస్తున్న తరుణంలో.. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నూతన నిబంధన, అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్‌పై పరిమితులు విధించే అవకాశం ఉంది. లేదా పూర్తిగా రద్దు చేసే ముప్పు కూడా ఉంది. ఈ ప్రతిపాదన ఫెడరల్ రెగ్యులేటరీ అజెండాలో చేర్చారు. ఇది 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో అమలులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

⦿ ఓపీటీ ఒక కీ రోల్..

Advertisement

అండర్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హతలను అమెరికాలో పూర్తిచేసి, F-1 వీసా పొందిన విదేశీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్లే మార్గంలో OPT ఒక ముఖ్యమైన అడుగు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితశాస్త్రం (STEM) కోర్సుల్లో ఎం.ఎస్ (MS) పూర్తి చేసిన తరువాత.. విద్యార్థులు OPTకి దరఖాస్తు చేసుకుంటారు. OPT ద్వారా వారు తమ చదువులకు సంబంధించిన సంస్థల్లో తొలి ఏడాది పాటు పనిచేసే అవకాశం లభిస్తుంది. STEM విద్యార్థులకు అదనంగా మరో రెండేళ్లపాటు (మొత్తం 3 ఏళ్లు) పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యవధిలోనే చాలామంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకుని.. చివరికి H-1B వీసా కోసం ప్రయత్నించడం ద్వారా అమెరికాలో స్థిరపడతారు.

⦿ విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారని..?

Advertisement

అయితే, ఈ OPT ప్రోగ్రామ్‌ను భారత్ సహా ఇతర దేశాల విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారని అమెరికాలోని కొన్ని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఈ సమస్య మొదలైంది. ఒకవేళ OPT విధానం పూర్తిగా రద్దైతే, ఆ ప్రభావం భారతీయ విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్రంగా పడుతుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది, ఎందుకంటే OPT అనేది వారికి చదువు పూర్తి అయిన తర్వాత పని అనుభవం, ఉద్యోగ భద్రత పొందే ముఖ్యమైన మార్గం. ఈ పరిస్థితి విద్యార్థులకే కాకుండా, అంతర్జాతీయ విద్యార్థుల ఫీజుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందుతున్న అమెరికన్ యూనివర్సిటీలకు కూడా ఆర్థిక నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది.

⦿ ట్రంప్ మాటల్లో వైరుధ్యం

ఇలాంటి కఠినమైన ప్రతిపాదనలు ఒకవైపు ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తుండగా.. ఇటీవల ఆయన (Donald Trump) చేసిన వ్యాఖ్యలు మాత్రం విదేశీ విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ఆయన అన్నారు. వారు అమెరికాకు రావడం ఇక్కడి వ్యాపారాలకు మంచిదని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు ఆర్థికంగా మద్దతుగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. విధానపరమైన నిర్ణయాలు, అధ్యక్షుడి బహిరంగ వ్యాఖ్యల మధ్య ఈ వైరుధ్యం అంతర్జాతీయ విద్యార్థుల్లో మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. రేపు ఈ ప్రాంతాల్లో సెలవు ఉంటుందా..?

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×