E-Paper
Advertisement

పిల్లల కోసం కొత్త స్కూల్‌లో అడ్మిషన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు చెక్ చేయడం తప్పనిసరి

పిల్లల కోసం కొత్త స్కూల్‌లో అడ్మిషన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు చెక్ చేయడం తప్పనిసరి
Advertisement

School Admission Checks Parenting Tips| పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఒక పెద్ద బాధ్యత. అందుకే వారి విద్యాబోధన కోసం సరైన పాఠశాల (స్కూల్) ఎంపిక చేయడం చాలా కీలకమైన నిర్ణయం. స్కూల్ లో లభించే బోధన, వాతావరణం.. పిల్లల భవిష్యత్తు మీద నేరుగా ప్రభావం చూపుతుంది. చాలా మంది తల్లిదండ్రులు స్కూల్ భవనం, స్థానం చూసి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇవి మాత్రమే సరిపోవు. అడ్మిషన్ ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను తప్పకుండా చెక్ చేయాలి. అప్పుడే తర్వాత తరచూ స్కూల్ మార్చాల్సిన అవసరం రాదు.

1. స్కూల్ అఫిలియేషన్ సరిగ్గా చూడండి

స్కూల్ ఏ బోర్డుకు అనుబంధం ఉందో తప్పకుండా వెరిఫై చేయండి. CBSE, ICSE, స్టేట్ బోర్డు.. ఇలా ఏ బోర్డు అని అడగండి. స్కూల్ యజమాన్యం చెప్పే మాటల విని మాత్రమే నిర్ణయం తీసుకోవద్దు. అధికారిక అఫిలియేషన్ నంబర్ అడగండి. అవసరమైతే బోర్డు వెబ్‌సైట్‌లో వెరిఫై చేయండి. రిపోర్టు కార్డులపై సరైన బోర్డు పేరు ఉండాలి. ఇది స్కూల్ విశ్వసనీయతను నిరూపిస్తుంది.

2. అసెస్‌మెంట్ సిస్టమ్ అర్థం చేసుకోండి

Advertisement

పరీక్షలు అకడమిక్ పర్‌ఫామెన్స్‌లో కీలకం. స్కూల్ ఎలా అసెస్‌మెంట్ చేస్తుందో అడగండి. యూనిట్ టెస్టులు, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి. సిలబస్ ఎలా విభజించి పరీక్షలు నిర్వహిస్తారో అడగండి. టీచర్లు ఎలా మార్కులు ఇస్తారో తెలుసుకోండి. స్పష్టమైన అసెస్‌మెంట్ సిస్టమ్ ఉంటే పిల్లలు సులభంగా సిద్ధం కాగలరు.

3. టీచింగ్ మెథడ్ తెలుసుకోండి

ప్రతి స్కూల్ టీచింగ్ పద్ధతి వేర్వేరుగా ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్ వారీగా, మరికొన్ని యూనిట్ బేస్డ్‌గా బోధిస్తాయి. టీచింగ్ మెథడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలు.. మీ పిల్లలు ఎలా నేర్చుకుంటారో ప్రభావితం చేస్తుంది. పరీక్షలు కూడా టీచింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటాయి. ఆధునిక పద్ధతులు లేదా సాంప్రదాయిక పద్ధతులు ఉపయోగిస్తారా అడగండి.

Advertisement

Also Read:  తల్లిదండ్రులు మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు.. పిల్లలను ప్రయోజకులుగా చేయడానికి ఇవి చాలా అవసరం

4. బలహీన విద్యార్థులకు మద్దతు ఉందా?

ప్రతి విద్యార్థి నేర్చుకునే వేగం వేరుగా ఉంటుంది. కొందరు త్వరగా అర్థం చేసుకుంటే, మరికొందరు అర్థం చేసుకోవడనాకి కాస్త అలస్యమవుతుంది. కొందరు కొన్ని సబ్జెక్టుల్లో ఇబ్బంది పడవచ్చు. బలహీన విద్యార్థులకు స్కూల్ ఎలాంటి మద్దతు ఇస్తుందో అడగండి. ఎక్స్‌ట్రా క్లాసులు లేదా రెమీడియల్ సెషన్లు ఉన్నాయా చూడండి. కష్టమైన అంశాలను మళ్లీ బోధించే వ్యవస్థ ఉందా అని అడగండి. మంచి స్కూల్స్ అవసరమైనప్పుడు స్టూడెంట్స్‌కు అదనపు సపోర్ట్ ఇస్తాయి.

సరైన పాఠశాల ఎంపిక చేయడం చాలా జాగ్రత్తతో చేయాలి. స్కూల్ బిల్డింగ్, లేదా స్థానం మాత్రమే చూడకండి. అఫిలియేషన్, టీచింగ్ మెథడ్, అసెస్‌మెంట్ సిస్టమ్, బలహీన విద్యార్థుల మద్దతు వంటి అంశాలను తప్పకుండా చెక్ చేయండి. మీ పిల్లల విద్యాభ్యాసం ఈ అంశాలుపై ఆధారపడి ఉంటాయి. అన్ని విషయాలు పూర్తిగా విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×