E-Paper
Advertisement

జీరో కేలరీస్ అని ‘షుగర్ ఫ్రీ డ్రింక్స్’ తాగుతున్నారా ? జాగ్రత్త

జీరో కేలరీస్ అని ‘షుగర్ ఫ్రీ డ్రింక్స్’ తాగుతున్నారా ? జాగ్రత్త
Advertisement

Diet Soda Side Effects: బరువు తగ్గాలని అనుకునేవారు లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగొద్దని భావించేవారు ఈ రోజుల్లో ఎక్కువగా ‘డైట్ సోడా’ లేదా ‘జీరో షుగర్’ అని రాసి ఉండే డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణ కూల్ డ్రింక్స్ కంటే ఇవి సేఫ్ అని అందరూ భావిస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఇస్తున్న హెచ్చరికలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! షుగర్ లేదనే ఒక్క నెపంతో వీటిని విపరీతంగా తాగేస్తే, ఇవి మీ శరీరంలో ఊహించని ‘సైలెంట్ కిల్లర్’గా మారి తీవ్రమైన రోగాలకు దారితీస్తాయి. అసలు ఈ షుగర్ ఫ్రీ డ్రింక్స్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డైట్ సోడాల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

బరువు తగ్గకపోగా..  పెరుగుతారు: డైట్ సోడా తాగితే బరువు తగ్గుతారనేది ఒక పెద్ద అపోహ. ఇందులో వాడే కృత్రిమ తీపి పదార్థాలు మన మెదడును అయోమయానికి గురిచేస్తాయి. నోటికి విపరీతమైన తీపి అనుభూతిని ఇస్తాయి కానీ కేలరీలను అందించవు. దీనివల్ల మెదడు ఆ తర్వాత ఇతర తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తినాలనే కోరికను విపరీతంగా పెంచుతుంది. ఫలితంగా మీరు మరింత ఎక్కువగా తిని బరువు పెరుగుతారు.

Advertisement

గుండెపోటు, పక్షవాతం ముప్పు: రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ డైట్ సోడాలు తాగే వారిలో గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు 20% నుంచి 30% వరకు పెరుగుతుందని పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల పరిశోధనల్లో తేలింది. ఇవి రక్తనాళాలలో మంటను పెంచి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

గుట్ హెల్త్ : మన పొట్టలో నివసించే మంచి బాక్టీరియా జీర్ణక్రియకు , రోగనిరోధక శక్తికి చాలా అవసరం. ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు ఈ మంచి బాక్టీరియాను చంపేసి, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరానికి దారితీస్తాయి.

Advertisement

Also Read: ఇంట్లో వాడే.. నూనె మీ గుండెను దెబ్బతీస్తోందా?

క్యాన్సర్ అండ్ టైప్-2 డయాబెటిస్: డైట్ సోడాలలో విస్తృతంగా వాడే ‘ఆస్పర్టేమ్’ అనే కెమికల్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘క్యాన్సర్ కలిగించే అవకాశం ఉన్న పదార్థంగా’ వర్గీకరించింది. అంతేకాకుండా, వీటిని నిత్యం తాగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి క్రమంగా టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

‘జీరో షుగర్’ లేదా ‘డైట్’ అనే లేబుల్స్ చూసి మోసపోకండి. కెమికల్స్‌తో తయారు చేసిన ఈ డ్రింక్స్ స్థానంలో కొబ్బరి నీళ్లు, ఇంట్లో తయారుచేసిన మజ్జిగ, లేదా తాజా నిమ్మకాయ నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. ఆర్టిఫిషియల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×