E-Paper
Advertisement

కాల్షియం లోపం గుండెకు ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయండి

కాల్షియం లోపం గుండెకు ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయండి
Advertisement

Low calcium and heart health: సాధారణంగా ఎవరికైనా కీళ్ల నొప్పులు వచ్చినా లేదా పళ్ళు బలహీనపడినా కాల్షియం తక్కువైందేమో అని అనుకుంటారు. కానీ.. కాల్షియం అనేది కేవలం ఎముకలకు సంబంధించిన ఖనిజం మాత్రమే కాదు. మన శరీరంలోని ప్రతి కణానికి, ముఖ్యంగా గుండె కండరాలు సంకోచించడానికి కాల్షియం.. అత్యంత కీలకం. రక్తంలో కాల్షియం స్థాయిలు తగ్గడాన్ని ‘హైపోకాల్సెమియా’ అంటారు. ఇది తీవ్రమైతే గుండె లయ తప్పడం నుంచి గుండె ఆగిపోయే.. వరకు దారి తీయవచ్చు. మన గుండె ఆరోగ్యానికి కాల్షియానికి ఉన్న సంబంధం ఏంటి? లోపం ఉంటే.. వచ్చే ఇబ్బందులేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కాల్షియం లోపం గుండెపై చూపే ప్రభావం:

Advertisement

గుండె అనేది ఒక శక్తివంతమైన కండరం. అది నిరంతరం రక్తాన్ని పంప్ చేయడానికి విద్యుత్ సంకేతాలు అవసరం. ఈ ప్రక్రియలో కాల్షియం ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది.

1. గుండె లయ తప్పడం:
గుండె కణాలు సంకోచించడానికి కాల్షియం అయాన్లు అవసరం. శరీరంలో కాల్షియం తక్కువగా.. ఉన్నప్పుడు, గుండెకు అందే విద్యుత్ సంకేతాలలో, మార్పులు వస్తాయి. దీని వల్ల గుండె కొట్టుకునే వేగంలో తేడాలు రావచ్చు (లయ తప్పడం). కొన్ని సార్లు గుండె చాలా వేగంగా లేదా.. అస్తవ్యస్తంగా కొట్టుకోవడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది.

Advertisement

2. గుండె కండరాల బలహీనత:
గుండె రక్తాన్ని పంప్ చేయాలంటే.. కండరాలు బలంగా సంకోచించాలి. కాల్షియం లోపం.. వల్ల ఈ సంకోచ శక్తి తగ్గుతుంది. దీనినే ‘మయోకార్డియల్ కాంట్రాక్టిలిటీ’ తగ్గడం అంటారు. దీని వల్ల శరీరంలోని మిగిలిన భాగాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఫలితంగా విపరీతమైన అలసట, ఆయాసం వస్తాయి.

3. హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు:
దీర్ఘకాలికంగా కాల్షియం లోపం ఉన్నట్లయితే.. గుండె పంపింగ్ సామర్థ్యం క్రమంగా తగ్గి పోతుంది. ఇది చివరికి ‘కన్జెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’కు దారి తీయవచ్చు. కాల్షియం తక్కువగా.. ఉండటం వల్ల గుండె గదులు సాగిపోయి బలహీనపడతాయి.

4. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
కాల్షియం స్థాయిలు పడిపోయినప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోవచ్చు లేదా గుండె కండరాలు పట్టేసినట్లు అనిపించవచ్చు. దీని వల్ల ఛాతిలో నొప్పి రావడం లేదా ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని చాలా మంది సాధారణ గ్యాస్ సమస్యగా పొరబడతారు.

కాల్షియం లోపం ఎందుకు ఏర్పడుతుంది?
విటమిన్ డి లోపం: విటమిన్ డి లేకపోతే.. మనం తినే ఆహారం నుంచి శరీరం కాల్షియాన్ని గ్రహించలేదు.

పారాథైరాయిడ్ సమస్యలు: శరీరంలో కాల్షియం స్థాయిలను నియంత్రించే పారాథైరాయిడ్ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోవడం.

కిడ్నీ సమస్యలు: కిడ్నీల వ్యాధులు ఉన్నవారిలో కాల్షియం విసర్జన ఎక్కువగా జరిగి లోపం ఏర్పడవచ్చు.

ఆహారపు అలవాట్లు: పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం.

గుండెను కాపాడుకోవడానికి ఏం చేయాలి ?
సమతుల్య ఆహారం: పాలు, పాల పదార్థాలు, రాగులు, బాదం, ఆకుకూరలు (పాలకూర, తోటకూర) క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఎండలో గడపడం: ఉదయం పూట కాసేపు ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది కాల్షియం గ్రహించడానికి సహాయ పడుతుంది.

రెగ్యులర్ చెకప్: 40 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారైనా రక్త పరీక్ష చేయించుకోవడం మంచిది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. కేవలం కొవ్వు పదార్థాలు తగ్గించడమే కాదు. శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతున్నాయో.. లేదో చూసుకోవాలి. కాల్షియం లోపాన్ని కేవలం ఎముకల సమస్యగా మాత్రమే చూడకుండా, అది గుండెపై చూపే ప్రభావాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌లో మీ గుండెను భద్రంగా కాపాడుకోండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×