// // Road Accident Truck Overturns on Auto: అదుపుతప్పిన ట్రక్కు కింద ఆటో నుజ్జు నుజ్జు.. నవదంపతులతో సహా నలుగురు మృతి -->
E-Paper
Advertisement

అదుపుతప్పిన ట్రక్కు కింద ఆటో నుజ్జు నుజ్జు.. నవదంపతులతో సహా నలుగురు మృతి

అదుపుతప్పిన ట్రక్కు కింద ఆటో నుజ్జు నుజ్జు.. నవదంపతులతో సహా నలుగురు మృతి
Advertisement

Road Accident Truck Overturns on Auto: మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో ఘెర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం శనివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో సిర్సోద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోంగ్రా రోడ్డుపై ఉన్న ఒక పెట్రోల్ పంప్ సమీపంలో జ‌రిగింది. వేగంగా వ‌స్తూ.. అదుపు తప్పిన ఓ ట్రక్కు పక్కనే ఆగి ఉన్న ఆటోపై బోల్తా పడటంతో ఈ దారుణం జరిగింది. పెళ్లైన కొద్ది గంటలకే నవదంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల కథనం ప్రకారం.. కోళ్ల దాణా లోడుతో వెళ్తున్న ఒక భారీ ట్రక్కు వేగంగా వస్తూ ఒక్కసారిగా అదుపు కోల్పోయింది. రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ వద్ద ఆగి ఉన్న‌ ఆటోపై ఆ ట్రక్కు అకస్మాత్తుగా బోల్తా పడింది. ట్రక్కులోని భారీ లోడు ఆటోపై పడటంతో, అందులో కూర్చున్న ప్రయాణీకులు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా లోపలే నలిగిపోయారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది.

Advertisement

ఈ ప్రమాదంలో మరణించిన వారిని నవదంపతులు, పెళ్లికొడుకు తల్లి, వదినగా పోలీసులు గుర్తించారు. వీరంతా వివాహ వేడుక ముగించుకుని రాజ్‌గఢ్ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకతో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగి, కొత్త జీవితం ప్రారంభమవుతుందని ఆశించిన కుటుంబాల్లో కొద్ది గంటల్లోనే మరణవార్త వినాల్సి రావడం స్థానికులను కన్నీరుమున్నీరు చేస్తోంది. పెట్రోల్ పంప్ వద్ద ఆటోను కేవలం కొద్ది నిమిషాల విశ్రాంతి కోసం ఆపినట్లు తెలుస్తోంది, కానీ అదే వారి జీవితాల్లో చివరి క్షణాలవుతాయని ఎవరూ ఊహించలేదు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సుమారు అరగంట పాటు శ్రమించి, భారీ క్రేన్ల సహాయంతో ట్రక్కును పక్కకు తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం వారిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతివేగం లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆనందంగా ప్రారంభమైన కొత్త జీవిత ప్రయాణం కొద్ది గంటల్లోనే విషాదంగా మారడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అదుపు తప్పిన వాహనం కారణంగా జరిగిన ఈ ఘటనలో నవదంపతులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisement

Read Also: ఒక్కసారే.. ఎక్కడికక్కడ ఆగిపోయిన వందలాది ట్యాక్సీలు.. ఓర్నీ ఇలా కూడా అవుతుందా?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×