E-Paper
Advertisement

రాత్రి భోజనం తరువాత ఐస్ క్రీమ్ తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే..

రాత్రి భోజనం తరువాత ఐస్ క్రీమ్ తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే..
Advertisement

చాలా మంది రాత్రి భోజనం తర్వాత ఐస్‌క్రీమ్ తినడానికి ఇష్టపడతారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే భోజనం తరువాత తీపి తినడం ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ ఆరోగ్య నిపుణులు రాత్రి ఐస్‌క్రీమ్ తినడం నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉండే చక్కెర, కొవ్వు జీర్ణక్రియను దెబ్బతీసి, శరీర పనితీరును ప్రభావితం చేస్తాయి.

ఐస్‌క్రీమ్ నిద్రను ఎందుకు ప్రభావితం చేస్తుంది?

ఐస్‌క్రీమ్‌లో చాలా ఎక్కువ చక్కెర, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచి, మెదడును చురుకుగా చేస్తుంది. తర్వాత ఆ స్థాయి హఠాత్తుగా తగ్గడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల భోజనం త్వరగా జీర్ణం కాదు. దీంతో కడుపు బరువుగా అనిపించి, నిద్రలో అసౌకర్యం ఏర్పడుతుంది.

చక్కెర మెదడును చురుకుగా ఉంచుతుంది

Advertisement

నిద్రపోయే ముందు శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతుంది. కానీ ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల ఈ సహజ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. చక్కెర తాత్కాలికంగా ఉత్సాహాన్ని పెంచి, నిద్రపోవడానికి కష్టమవుతుంది. కొందరు ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత విచిత్రమైన కలలు చూస్తారని, నిద్ర అస్థిరంగా ఉంటుందని చెబుతున్నారు.

పాల ఉత్పత్తులు జీర్ణ సమస్యలు కలిగిస్తాయి

ఐస్‌క్రీమ్‌లో పాల ఉత్పత్తులు ఉండటం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు వస్తాయి. లాక్టోస్ ఇంటాలరెన్స్ (పాల ఉత్పత్తులు తింటే ఆరోగ్య సమస్యలు) ఉన్నవారికి ఉబ్బరం, గ్యాస్, కడుపు అసౌకర్యం ఎక్కువవుతాయి. భోజనం తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఆసిడ్ రిఫ్లక్స్, గుండెలో మంట వస్తాయి.

రాత్రి ఐస్‌క్రీమ్ క్రేవింగ్స్‌ను పెంచుతుంది

Advertisement

తీపి తినడం వల్ల రాత్రి సమయంలో అనవసరమైన ఆహార అలవాట్లు పెరుగుతాయి. కొందరు రాత్రి ఐస్‌క్రీమ్ క్రేవింగ్స్‌ను అదుపు చేయలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

చాక్లెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ మరింత హానికరం

చాక్లెట్ ఐస్‌క్రీమ్‌లో కెఫీన్, థియోబ్రోమిన్ ఉంటాయి. ఇవి మెదుడుని చురుకుగా ఉంచి, నిద్ర రాకుండా చేస్తాయి.

బరువు పెరగడానికి కారణమవుతుంది

రాత్రి ఐస్‌క్రీమ్ తినడం వల్ల అనవసర క్యాలరీలు పెరుగుతాయి. నిద్ర లోపం కూడా ఆకలిని పెంచి, తదుపరి రోజు అనారోగ్యకర ఆహారం తినే అవకాశాన్ని పెంచుతుంది.

నిద్రకు ముందు మంచి ప్రత్యామ్నాయాలు

నిపుణులు రాత్రి తేలికపాటి స్నాక్స్ తినాలని అభిప్రాయపడుతున్నారు. పండ్లు, పెరుగు, వెచ్చని పాలు, తులసి గింజలు మంచివి. భోజనం తర్వాత కనీసం రెండు గంటలు గడిచాక నిద్రపోవాలి.

Also Read: ఫోన్ లేకుంటే పిల్లలు ఏడుస్తున్నారా? ఈ అలవాటు మాన్పించడానికి ఈజీ టిప్స్

ఐస్‌క్రీమ్ తినడం ఎప్పుడు సమస్య కాదు?

అప్పుడప్పుడు, మోతాదులో తినడం వల్ల పెద్ద సమస్య రాకపోవచ్చు. కానీ రోజూ తినడం మంచిది కాదు.

రాత్రి ఐస్‌క్రీమ్ తినడం ఆహ్లాదంగా అనిపించినా.. ఇందులోని చక్కెర, కొవ్వు నిద్రను, జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. తేలికపాటి స్నాక్స్ తీసుకోవడం ద్వారా మంచి నిద్ర, ఆరోగ్యం కాపాడుకోవచ్చు

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×