E-Paper
Advertisement

Cucumber: కీరదోసతో వేసవి తాపానికి చెక్! ఏ సమయంలో తింటే ఎక్కువ లాభమో తెలుసా?

Cucumber: కీరదోసతో వేసవి తాపానికి చెక్! ఏ సమయంలో తింటే ఎక్కువ లాభమో తెలుసా?
Advertisement

Cucumber: వేసవి కాలం వచ్చిందంటే చాలు. భానుడి భగభగలకు మన శరీరం విలవిలలాడుతుంది. ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోయి నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం ‘కీరదోస’. దాదాపు 95% నీటి శాతాన్ని కలిగి ఉండే కీరదోస, శరీరాన్ని లోపల నుంచి చల్లబరచడమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే.. కీరదోసను ఏ సమయంలో తింటే పూర్తి పోషకాలు అందుతాయి? ఏ సమయంలో తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కీరదోస తినడానికి బెస్ట్ టైం ఏది?
వేసవిలో కీరదోస తినడానికి పగటి సమయం, ముఖ్యంగా మధ్యాహ్నం చాలా బెస్ట్.

Advertisement

బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ : ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్న భోజనంలో సలాడ్ రూపంలో కీరదోస తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయ పడుతుంది.

ఖాళీ కడుపుతో: ఉదయం పూట ఖాళీ కడుపుతో కీరదోస జ్యూస్ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.

Advertisement

ఎండలో తిరిగి వచ్చినప్పుడు: బయట ఎండలో.. తిరిగి వచ్చిన వెంటనే కాకుండా.. కాసేపు ఆగి కీరదోస ముక్కలు తింటే.. శరీర ఉష్ణోగ్రత వెంటనే నియంత్రణలోకి వస్తుంది.

రాత్రి పూట తినవచ్చా?
చాలా మంది చేసే పొరపాటు రాత్రి పూట కీరదోస తినడం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రి పడుకునే ముందు కీరదోస తినడం మంచిది కాదు. ఎందుకంటే..

నిద్ర : కీరదోసలో నీటి శాతం ఎక్కువ. రాత్రి పూట తింటే మాటిమాటికీ.. యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల గాఢ నిద్ర ఉండదు.

జీర్ణ సమస్యలు: రాత్రి పూట జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది. కీరదోసలోని ‘కుకుర్బిటాసిన్’ అనే పదార్థం వల్ల కొందరికి కడుపు ఉబ్బరం లేదా అజీర్తి కలిగే అవకాశం ఉంది.

వేసవిలో కీరదోస వల్ల కలిగే లాభాలు:
డీహైడ్రేషన్ దూరం: శరీరంలో నీటి నిల్వలను సమతుల్యం చేయడంలో దీనికి సాటి లేదు.

బరువు తగ్గడం: ఇందులో క్యాలరీలు చాలా తక్కువ, పీచు పదార్థం ఎక్కువ. ఇది తింటే కడుపు నిండుగా అనిపించి.. ఇతర ఆహారాలను తక్కువగా తీసుకుంటాం.

Also Read: శరీరంలో వేడి సెగలు పుడుతున్నాయా? 5 నిమిషాల్లో బాడీ హీట్ తగ్గించే మ్యాజిక్ టిప్స్!

చర్మ సౌందర్యం: కీరదోస తిన్నా లేదా దాని రసాన్ని ముఖానికి రాసుకున్నా ఎండ వల్ల వచ్చే ట్యాన్ తగ్గుతుంది. చర్మం మెరుస్తుంది.

నోటి దుర్వాసన: ఒక కీరదోస ముక్కను నోటి పైభాగంలో కాసేపు నొక్కి పడితే.. నోటిలోని బ్యాక్టీరియా నశించి దుర్వాసన తగ్గుతుంది.

కీరదోస వేసవి కాలానికి ఒక సంజీవని లాంటిది. అయితే దాన్ని సరైన పద్ధతిలో.. సరైన సమయంలో తీసుకున్నప్పుడే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. వీలైనంత వరకు పగటిపూట మాత్రమే కీరదోసను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. ముఖ్యంగా కీరదోస తిన్న వెంటనే నీళ్లు తాగకూడదనే నియమాన్ని గుర్తుంచుకోండి,.ఎందుకంటే ఇది జీర్ణక్రియలో ఆటంకం కలిగిస్తుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ వేసవిని ఆరోగ్యంగా గడిపేయండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×