E-Paper
Advertisement

Kidney Detox Juice: కిడ్నీ డిటాక్స్ కోసం.. బెస్ట్ డ్రింక్స్, ఇవి తాగితే బోలెడు బెనిఫిట్స్

Kidney Detox Juice: కిడ్నీ డిటాక్స్ కోసం.. బెస్ట్ డ్రింక్స్, ఇవి తాగితే బోలెడు బెనిఫిట్స్
Advertisement

Kidney Detox Juice: మన శరీరంలోని మలినాలను విషతుల్యాలను వడపోసి బయటకు పంపడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. తప్పుడు ఆహారపు అలవాట్లు, తక్కువగా నీరు తాగడం, కాలుష్యం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, వాటిని సహజంగా శుభ్రం చేయడానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్‌లు అద్భుతంగా పనిచేస్తాయి. కిడ్నీ డిటాక్స్ కోసం ఎలాంటి జ్యూస్ లు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీలను శుభ్రపరిచే బెస్ట్ జ్యూస్‌లు:

Advertisement

కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి, వ్యర్థాలను తొలగించడానికి ఈ క్రింది జ్యూస్‌లు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

1. క్రాన్‌బెర్రీ జ్యూస్: కిడ్నీ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు క్రాన్‌బెర్రీ జ్యూస్ దివ్యౌషధం. ఇది కిడ్నీలలో బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది.అంతే కాకుండా కాల్షియం ఆక్సలేట్ (రాళ్లు ఏర్పడటానికి కారణం) నిల్వలను తగ్గిస్తుంది. అయితే.. ఇందులో చక్కెర కలపకుండా తాగడం మంచిది.

Advertisement

2. నిమ్మరసం : నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ఇది మూత్రంలో సిట్రేట్ స్థాయిలను పెంచి, రాళ్లను కరిగించడంలో సహాయ పడుతుంది. ప్రతిరోజూ ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల కిడ్నీలు శుభ్రపడతాయి.

3. బీట్‌రూట్ జ్యూస్: బీట్‌రూట్‌లో ఉండే ‘బీటైన్’ అనే మూలకం మూత్రం యొక్క అసిడిటీని పెంచుతుంది. ఇది కిడ్నీలలో పేరుకు పోయిన కాల్షియం ఫాస్ఫేట్, మలినాలను తొలగించడానికి సహాయ పడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగు పరచడంలో కూడా తోడ్పడుతుంది.

4. పుచ్చకాయ జ్యూస్ : పుచ్చకాయలో పొటాషియం, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్ర విసర్జనను పెంచి , కిడ్నీల నుంచి వ్యర్థాలను వేగంగా బయటకు పంపుతుంది. ఇందులో ఉండే లైకోపిన్ కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

5. కొత్తిమీర, పుదీనా జ్యూస్: కొత్తిమీర కిడ్నీలను డిటాక్స్ చేయడంలో చాలా శక్తివంతమైనది. ఒక కప్పు కొత్తిమీర ఆకులను నీటిలో మరిగించి లేదా జ్యూస్‌గా చేసుకుని తాగితే, శరీరంలోని అదనపు ఉప్పు మరియు విషతుల్యాలు బయటకు పోతాయి.

6. దోసకాయ జ్యూస్: దోసకాయలో 90% పైగా నీరు ఉంటుంది. ఇది కిడ్నీలలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్‌ను కరిగించడానికి , కిడ్నీ రాళ్లను నివారించడానికి సహాయ పడుతుంది.

7. క్యారెట్ , ఆపిల్ జ్యూస్: ఈ కలయికలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల వాపును తగ్గిస్తాయి. ఆపిల్‌లో ఉండే పెక్టిన్ కిడ్నీలపై పడే భారాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది.

Also Read: హై కొలెస్ట్రాల్ లక్షణాలు ఇవే.. లైట్ తీసుకుంటే చాలా డేంజర్ !

జాగ్రత్తలు:

మీకు ఇప్పటికే ఏదైనా తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉంటే, పొటాషియం ఎక్కువగా ఉండే జ్యూస్‌లు తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టరును సంప్రదించాలి.

జ్యూస్‌లలో అదనపు చక్కెర లేదా ఉప్పు కలపకూడదు.

రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన డిటాక్స్ పద్ధతి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×