E-Paper
Advertisement

Wake Up Early: విజేతల అలవాటు.. ఉదయాన్నే నిద్రలేవడం మీ కెరీర్‌ని ఎలా మారుస్తుంది ?

Wake Up Early: విజేతల అలవాటు.. ఉదయాన్నే నిద్రలేవడం మీ కెరీర్‌ని ఎలా మారుస్తుంది ?
Advertisement

Wake Up Early: త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేవడం మనిషిని ఆరోగ్యంగా.. సంపన్నంగా ,తెలివైనవాడిగా చేస్తుంది అనేది ఒక ప్రసిద్ధ సామెత. ప్రకృతితో కలిసి జీవించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల మన శరీరానికి అవసరమైన తాజా గాలి, ప్రశాంతమైన వాతావరణం లభిస్తాయి. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా.. మానసిక వికాసానికి అంతే కాకుండా రోజువారీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ఎంతో తోడ్పడుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉదయాన్నే నిద్రలేవడం ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది.

తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:

Advertisement

చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా పడుకుని, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు చేసుకుంటారు. అయితే.. ప్రకృతితో మన శరీరాన్ని అనుసంధానించడం వల్ల కలిగే లాభాలు అపారమైనవి. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. మెరుగైన ఉత్పాదకత:
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీకు రోజంతా అదనపు సమయం దొరుకుతుంది. ప్రపంచం మొత్తం నిద్రపోతున్న వేళ, నిశ్శబ్దంగా ఉండే ఆ సమయం మీ పనులపై దృష్టి సారించడానికి అద్భుతంగా ఉపయోగ పడుతుంది. దీని వల్ల పనులు త్వరగా పూర్తవడమే కాకుండా.. పని నాణ్యత కూడా పెరుగుతుంది.

Advertisement

2. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత:
తెల్లవారుజామున వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాహనాల శబ్దాలు, ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ ఉండవు. ఈ సమయంలో ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఇది రోజంతా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి , సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

3. శారీరక ఆరోగ్యం ,వ్యాయామం:
ఉదయాన్నే లేవడం వల్ల వ్యాయామం చేయడానికి తగిన సమయం దొరుకుతుంది. ఉదయం పూట గాలిలో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో నడక లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే.. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్-డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

4. పోషకాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్:
చాలా మంది ఆలస్యంగా లేవడం వల్ల ఆఫీసుకో లేదా కాలేజీకో వెళ్లే హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు . కానీ ఉదయాన్నే లేవటం వల్ల ప్రశాంతంగా పోషక విలువలున్న అల్పాహారం తీసుకోవడానికి వీలవుతుంది. ఇది శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది.

5. మెరుగైన నిద్ర నాణ్యత:
ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉన్నవారిలో ‘సర్కాడియన్ రిథమ్’ క్రమబద్ధంగా ఉంటుంది. దీని వల్ల రాత్రిపూట సహజంగానే త్వరగా నిద్ర వస్తుంది. గాఢనిద్ర వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది, దీని వల్ల మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా నిద్రలేవవచ్చు.

6. ఒత్తిడి తగ్గింపు:
చివరి నిమిషంలో పనులు పూర్తి చేయడం వల్ల కలిగే ‘లాస్ట్ మినిట్ రష్’ ఒత్తిడిని పెంచుతుంది. ఉదయాన్నే లేవడం వల్ల పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకోవచ్చు. దీని వల్ల ఆందోళన తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Also Read: స్వీట్ పొటాటో ఛాలెంజ్.. నెల రోజుల్లో మీ ఆరోగ్యం ఎలా మారుతుందంటే?

ఎలా అలవాటు చేసుకోవాలి ?
రాత్రిపూట త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి.

పడుకునే గంట ముందు ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను పక్కన పెట్టాలి.

ఒక్కసారిగా కాకుండా.. డైలీ 15 నిమిషాల ముందు లేవడం ద్వారా మెల్లగా అలవాటు చేసుకోవాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×