E-Paper
Advertisement

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అలసటగా అనిపిస్తోందా? డాక్టర్లు చెప్పే కారణాలు ఇవే

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అలసటగా అనిపిస్తోందా? డాక్టర్లు చెప్పే కారణాలు ఇవే
Advertisement

ఉదయం నిద్ర లేచిన తరువాత అందరూ ఫ్రెష్‌గా ఫీలవుతారు. ఆ సమయంలో ఏదైనా పనిచేస్తే ఏకాగ్రతతో చేయగలరు. కానీ చాలా మంది గంటల తరబడి నిద్రపోయినా బలహీనంగా, అలసటగానే ఫీలవుతారు. ఈ రోజువారీ అలసట మూడ్, ఎనర్జీ, మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. స్లీప్ డాక్టర్లు రాత్రి పడుకోవడానికి ముందు మీ అలవాట్లు నిద్ర నాణ్యతను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. రాత్రి సమయంలో మీ చెడు అలవాట్లు.. శరీరం సహజ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తాయి. మంచి నిద్ర అలవాట్లు శరీరాన్ని తాజాగా, చురుకుగా ఉంచుతాయి.

సరైన నిద్ర సమయం పాటించకపోతే వచ్చే సమస్యలు

అమెరికాకు చెందిన ప్రముఖ నిద్ర నిపుణులు డాక్టర్ క్రిస్టోఫర్ అల్లెన్ ప్రకారం.. ప్రతి రోజు వేర్వేరు సమయాల్లో నిద్రపోతే శరీరంలో ఉండే అంతర్గత గడియారం (నిద్ర చక్రం) గందరగోళంలో పడుతుంది. దీంతో గాఢ నిద్ర లభించదు, శరీరం సరిగా రిపేర్ కాదు. అందుకే ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. స్థిరమైన సమయం నిద్ర క్వాలిటీని మెరుగుపరుస్తుంది.

నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వాడటం 

Advertisement

చాలా మంది నిద్రపోయే ముందు ఫోన్ చూస్తారు. ఫోన్ స్క్రీన్ వెలుగు మెలటోనిన్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మంచి నిద్రకు సహాయపడుతుంది. ఫోన్ వల్ల నిద్ర ఆలస్యమవుతుంది. డాక్టర్లు నిద్రకు ముందు కనీసం 30 నిమిషాల ముందు ఫోన్ పక్కన పెట్టాలని చెబుతారు. బదులుగా పుస్తకం చదవడం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం మంచిది.

స్ట్రెస్, ఆందోళన మనసు చురుకుగా ఉంచుతాయి

మానసిక ఒత్తిడి, ఆందోళన నిద్రపోకుండా చేస్తాయి. పడుకున్నా ఆలోచనలు తగ్గవు. డాక్టర్లు స్ట్రెస్‌ను ఉదయం అలసటకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. యోగా ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు మనసును శాంతపరుస్తాయి.

నిద్రపోయే ముందు ఎక్కువగా తినడంతో తీవ్ర సమస్యలు

Advertisement

రాత్రి ఎక్కువ ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ కొనసాగుతుంది. మసాలా, నూనెలు ఎక్కువగా ఉంటే యాసిడిటీ వస్తుంది. డాక్టర్లు నిద్రకు కనీసం రెండు గంటల ముందు భోజనం పూర్తి చేయాలని సూచిస్తారు. తేలికపాటి ఆహారం మంచి నిద్రకు సహాయపడుతుంది.

వ్యాయామం లేకపోవడం నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది

శారీరక శ్రమ లేకపోతే శరీరం సహజంగా అలసట చెందదు. అందుకే ప్రతి రోజూ వాకింగ్ చేయడం లేదా వ్యాయామం చేయడం వల్ల రాత్రి మంచి నిద్ర వస్తుంది. అయితే నిద్రకు ముందు భారీ వ్యాయామాలు చేయకూడదు.

పడకగదిలో నిద్ర వాతావరణం తప్పనిసరి

బెడ్‌రూంలో ఎక్కువగా శబ్దం, వెలుతురు ఉన్న గదిలో మంచి నిద్ర రాదు. గదిని చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉంచాలి. పడుకునే బెడ్, పరుపు, దిండు అన్నీ సౌకర్యంగా ఉండడం ముఖ్యం.

Also Read: ఇంట్లో వంటలు తిన్నా క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

రాత్రి సమయంలో టీ, కాఫీ తాగడం

కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫీన్ నిద్రను ఆలస్యం చేస్తుంది. నిద్రకు కొన్ని గంటల ముందు ఈ కెఫీన్ డ్రింక్స్ తాగడం మానుకోవాలి. వెచ్చని పాలు లేదా హెర్బల్ టీ మంచి ప్రత్యామ్నాయాలు.

ఉదయం అలసట, రాత్రి అలవాట్ల వల్లే వస్తుంది. స్థిరమైన నిద్ర సమయం, ఫోన్ తగ్గించడం, రిలాక్సేషన్, సరైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర వాతావరణం ద్వారా ఆరోగ్యకరమైన నిద్ర సాధ్యమవుతుంది. చిన్న మార్పులు రోజంతా శక్తినిస్తాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×