E-Paper
Advertisement

ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలా? ఈ 5 అలవాట్లను పాటిస్తే రోగాలు మీ దరిచేరవు!

ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలా? ఈ 5 అలవాట్లను పాటిస్తే రోగాలు మీ దరిచేరవు!
Advertisement

Healthy Lifestyle Habits: ఈ రోజుల్లో చిన్న సమస్య వస్తే చాలు.. హాస్పిటల్ చుట్టూ తిరగడం, వేలల్లో బిల్లులు కట్టడం సర్వసాధారణం అయిపోయింది.కల్తీ ఆహారం, పెరిగిన కాలుష్యం,అన్నింటికీ మించి మారిన మన లైఫ్ స్టైల్ వల్ల బాడీలో ఇమ్యూనిటీ పడిపోయి ఈజీగా రోగాల బారిన పడుతున్నాం. అసలు హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా.. లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండటం సాధ్యమేనా?” అంటే.. పక్కాగా సాధ్యమేనని చెప్తున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. దానికి జిమ్‌లకు వెళ్లి గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. మన డైలీ రొటీన్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. మనల్ని హాస్పిటల్స్‌కు దూరంగా ఉంచే ఆ 5 గోల్డెన్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడే చూసేద్దాం.

మిమ్మల్ని నిరంతరం ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన అలవాట్లు:

Advertisement

1.రోజును ‘వాటర్ థెరపీ’తో స్టార్ట్ చేయండి:
పొద్దున లేవగానే చాలా మందికి బెడ్ కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది.కానీ.. దానికి బదులు లీటరు లేదా కనీసం రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి. రాత్రంతా మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ (వ్యర్థాలు) అన్నీ ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల బయటకు కొట్టుకుపోతాయి. ఇది మీ మెటబాలిజం రేటును పెంచడమే కాకుండా.. కిడ్నీలు, లివర్ ఫంక్షనింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది. చర్మం కూడా గ్లోయింగ్‌గా మారుతుంది.

2.‘రెయిన్‌బో ప్లేట్’ ఫార్ములా పాటించండి:
మనం తినే ఆహారంలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉండాలి. ఇందుకోసం ‘రెయిన్‌బో ప్లేట్’ పద్ధతిని ఫాలో అవ్వండి.అంటే.. మీ భోజనంలో కేవలం తెల్లటి అన్నం, ఏదో ఒక కూర మాత్రమే కాకుండా.. రంగు రంగుల కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఏ ఆహారంలో అయితే ఎక్కువ రంగులు (సహజమైన రంగులు) ఉంటాయో.. అందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో క్యాన్సర్ కణాలు పెరగకుండా.. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా రక్షిస్తాయి.

Advertisement

3.రోజుకు 30 నిమిషాల ‘కదలిక’ కచ్చితం:
“నాకు వర్కవుట్ చేసే టైం లేదు బాస్” అనే సాకులు పక్కన పెట్టండి. రోజంతా కుర్చీకే పరిమితం కాకుండా..కనీసం ఒక 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి. అది బ్రిస్క్ వాకింగ్ (వేగంగా నడవడం), సైక్లింగ్, డాన్స్, యోగా లేదా మీకు నచ్చిన ఆట ఏదైనా కావచ్చు. ఇలా చేయడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, గుండె పటిష్టంగా మారుతుంది. అంతేకాదు.. ఈ రోజుల్లో సైలెంట్ కిల్లర్స్‌గా మారిన బీపీ, షుగర్ (డయాబెటిస్)వంటి దీర్ఘకాలిక రోగాలు మీ దరిచేరవు.

4. కంటినిండా 7 గంటల నాణ్యమైన నిద్ర:
మనం బాడీకి ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా, ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా..సరైన నిద్ర లేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.రాత్రి 10 గంటల కల్లా మొబైల్‌ను పక్కన పడేసి ప్రశాంతంగా పడుకోవడం అలవాటు చేసుకోండి. మనం నిద్రపోతున్నప్పుడే మన శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. రోజుకు 7 నుండి 8 గంటల పాటు గాఢ నిద్రపోవడం వల్ల రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది.మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా మాయమవుతాయి.

5.మైండ్ బ్రేక్స్ & పాజిటివ్ థింకింగ్:
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. నిరంతరం ఆఫీస్ టెన్షన్స్, సోషల్ మీడియా నెగిటివిటీతో మైండ్‌ను ఫిల్ చేయకండి. రోజులో కనీసం 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని మెడిటేషన్ (ధ్యానం) చేయండి లేదా నచ్చిన మ్యూజిక్ వినండి.నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి, నవ్వడం అలవాటు చేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటే బాడీలో ‘హ్యాపీ హార్మోన్లు’విడుదలై, రోగాల లార్వాను అక్కడికక్కడే తుడిచి పెట్టేస్తాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×