E-Paper
Advertisement

Dehydration Signs: డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు !

Dehydration Signs: డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు !
Advertisement

Dehydration Signs: మన శరీరానికి నీరు చాలా అవసరం. రోజూ సరిపడా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. చాలా మంది దీనిని చిన్న విషయం అనుకుంటారు కానీ ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. డీహైడ్రేషన్ వల్ల అలసట, తలనొప్పి నుంచి తీవ్రమైన సమస్యల వరకు రావచ్చు. మన శరీరం కొన్ని సంకేతాల ద్వారా నీరు తక్కువగా ఉందని ముందుగానే హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను గుర్తిస్తే ఆరోగ్య సమస్యలను సులభంగా నివారించవచ్చు.

డీహైడ్రేషన్ అనే చేయడం వల్ల వస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయాలంటే.. నీరు చాలా ముఖ్యం. నీటి తగినంత లేకపోతే శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలను చూపిస్తుంది. వాటిని గుర్తించడం చాలా అవసరం.

Advertisement

డీహైడ్రేషన్ సంకేతాలు:

1. దాహం ఎక్కువగా వేయడం:
ఇది డీహైడ్రేషన్ యొక్క మొదటి సంకేతం. శరీరానికి నీరు అవసరమని ఇది సూచిస్తుంది.

Advertisement

2. నోరు పొడిగా ఉండటం:
లాలాజలం తగ్గిపోవడం వల్ల నోరు పొడిగా అనిపిస్తుంది. ఇది నీరు తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది.

3. అలసట ,బలహీనత:
శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతాయి. దాంతో అలసట ఎక్కువగా అనిపిస్తుంది.

4. తలనొప్పి:
డీహైడ్రేషన్ వల్ల మెదడుకు సరైన రక్త ప్రసరణ జరగక తల నొప్పి వస్తుంది.

5. యూరిన్ రంగు మారడం:
మూత్రం గాఢంగా ఉండటం లేదా తరచుగా మూత్రం పోకపోవడం కూడా ఒక ముఖ్యమైన సంకేతం.

6. చర్మం పొడిగా మారడం:
శరీరంలో నీరు తగ్గితే చర్మం తేమ కోల్పోయి పొడిగా మారుతుంది.

7. తల తిరగడం:
డీహైడ్రేషన్ వల్ల రక్తపోటు తగ్గి తల తిరగడం లేదా బలహీనంగా అనిపిస్తుంది.

8. హృదయ స్పందన పెరగడం:
నీరు తక్కువగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ వేగంగా ఉంటుంది.

9. కండరాల నొప్పులు:
నీటి కొరత వల్ల కండరాలు సరిగ్గా పనిచేయవు.

10. దృష్టి లోపం:
మెదడుకు సరిగ్గా నీరు అందకపోతే ఏకాగ్రత చాలా వరకు తగ్గుతుంది.

Also Read: రక్తంలో ఆక్సిజన్ తక్కువైతే.. కనిపించే లక్షణాలివే ! అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

డీహైడ్రేషన్‌ను నివారించడానికి రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాలి. వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. జ్యూస్‌లు, కొబ్బరి నీరు వంటి డ్రింక్స్ తీసుకోవడం కూడా మంచిది. శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకుంటే డీహైడ్రేషన్‌ను సులభంగా నియంత్రించవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×