E-Paper
Advertisement

Whatsapp : ఫేక్ అకౌంట్లపై వాట్సాప్ ఉక్కుపాదం

Whatsapp : ఫేక్ అకౌంట్లపై వాట్సాప్ ఉక్కుపాదం
Advertisement

Whatsapp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్… తాజాగా భారీ సంఖ్యలో ఫేక్ అకౌంట్లను నిషేధించింది.సెప్టెంబర్ 30 వరకు ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. ఇందులో 8 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్లను ఎలాంటి ఫిర్యాదులూ రాకముందే తొలగించినట్లు వాట్సాప్ వెల్లడించింది.

ఫేక్‌ వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు… తప్పుడు, నకిలీ ఖాతాలను బ్యాన్‌ చేశామని వాట్సాప్ వెల్లడించింది. భారత ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు నెలవారీ నివేదికలో వెల్లడించింది… వాట్సాప్. 2022 సెప్టెంబర్ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నామంది… వాట్సాప్.

Advertisement

గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా యూజర్ల కంప్లైంట్లపై స్పందించి చర్యలు తీసుకుంటున్నామని వాట్సాప్ వెల్లడించింది. ప్లాట్‌ఫామ్‌లో హానికర కంటెంట్‌ రాకుండా చూసుకుంటున్నామని, నష్టం జరిగిపోయాక గుర్తించడం కన్నా… ముందుగా నివారించాలన్నదే తమ ప్రాధాన్యత అని వాట్సాప్‌ వెల్లడించింది. వాట్సాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×