E-Paper
Advertisement

Stock Market : స్టాక్ మార్కెట్లకు రెండోరోజూ నష్టాలు

Stock Market : స్టాక్ మార్కెట్లకు రెండోరోజూ నష్టాలు
Advertisement

Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచడంతో… ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. ఇక్కడ కూడా అదే సెంటిమెంట్ తో… గురువారం దేశీయ సూచీలు నష్టపోయాయి.

Advertisement

అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్… వడ్డీరేట్లను మరో 75 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేదాకా రేట్ల పెంపు కొనసాగుతుందని సంకేతాలిచ్చింది. దాంతో… అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఆ ఎఫెక్ట్ మన మార్కెట్లలోనూ కనిపించింది. ఉదయం 60,511 పాయింట్ల దగ్గర నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌… ఇంట్రాడేలో 60,994-60,485 పాయింట్ల మధ్య చలించింది. ఒక దశలో నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి వచ్చినా… తిరిగి అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో… నష్టాలు పరిమితమయ్యాయి. చివరికి సెన్సెక్ 70 పాయింట్లు నష్టపోయి… 60,836 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 18,053 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌-30 సూచీలో 13 షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, డాక్టర్ రెడ్డీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు లాభపడ్డగా… టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టపోయాయి. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు నష్టపోయి… రూ.82.90 వద్ద నిలిచింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×