E-Paper
Advertisement

Item songs: సినిమా పాటలా? లేక బూతుల మేళా? హద్దులు దాటుతున్న ఐటెం సాంగ్స్

Item songs: సినిమా పాటలా? లేక బూతుల మేళా? హద్దులు దాటుతున్న ఐటెం సాంగ్స్
Advertisement

Item songs: ఒకప్పుడు సినిమా పాట అంటే సాహిత్యం, సంగీతం మేళవింపు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురవాలంటే ‘అడల్ట్ కంటెంట్’ ఉండాల్సిందే అన్నట్లుగా తయారైంది మేకర్స్ తీరు . చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు కలిసి చూస్తారన్న కనీస జ్ఞానం లేకుండా పచ్చి బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులతో పాటలను నింపేస్తున్నారు. స్కిన్ షో అయితే మరీ హద్దులు దాటిపోతోంది.

‘KD’ నుంచి ‘పుష్ప’ వరకు అంతా అదే దారి
కన్నడ స్టార్ ధ్రువ సర్జా నటిస్తున్న ‘KD – ది డెవిల్’ చిత్రంలోని రీసెంట్ ఐటమ్ సాంగ్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఈ పాటలో సాహిత్యం తో పాటు విజువల్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ఐటమ్ సాంగ్ అంటే కేవలం ఎక్స్‌పోజింగ్ మాత్రమే అన్నట్లుగా, వెస్ట్రన్ అడల్ట్ సినిమాలను తలపించేలా చిత్రీకరించారు. కేవలం మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని, సినిమా విలువలను గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది.

Advertisement

స్టార్ హీరోల సినిమాల్లోనూ అదే బాట
సుకుమార్ మార్క్ ఐటమ్ సాంగ్స్ అంటేనే ఒక రేంజ్‌లో ఉంటాయి. కానీ ‘పుష్ప ‘ లోని ఊ అంటావా చూస్తే..సమంత గ్లామర్‌ను వాడుకోవడంలో తప్పులేదు కానీ, ఆ లిరిక్స్‌లో అక్కడక్కడా దొర్లే పదాలు ఫ్యామిలీతో కలిసి వినడానికి ఇబ్బందిగా ఉన్నాయని విమర్శకుల  వాదన .యానిమల్ లోని  జమాల జమాల అనే  పాట మ్యూజికల్ గా పెద్ద హిట్ అయినా, సినిమాలో దాని చిత్రీకరణ మరియు బాబీ డియోల్ ఎంట్రీ సీన్ లోని రక్తపాతం, హింస అడల్ట్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి.మహేష్ బాబు లాంటి స్టార్ హీరో  నటించిన గుంటూరు కారంలో  కుర్చీ మడతపెట్టి  అనే  ఒక సోషల్ మీడియా ‘బూతు’ డైలాగ్‌ను మెయిన్ హుక్ లైన్ గా పెట్టుకుని పాట చేయడం టాలీవుడ్ ఏ స్థాయికి పడిపోయిందో అర్థం అవుతుంది.ఇక  విజయ్ దేవరకొండ – అనన్య పాండే కాంబినేషన్లో వచ్చిన లైగర్ లో  – ఆక్డీ పాక్డీ  పాటలో సాహిత్యం కంటే హీరోయిన్ డ్రెస్సింగ్, మూమెంట్స్ మరీ అసభ్యంగా ఉన్నాయనే కామెంట్స్ వచ్చాయి. పూరి జగన్నాథ్ సినిమాల్లో డబుల్ మీనింగ్ అనేది కామన్ అని, ఇక వల్గారిటీ అనేది ఒక ట్రేడ్ మార్క్ లా మారిపోవడం దురదృష్టకరం. ఇలా తవ్వుకుంటూ పొతే ఇక్కడ కోకొల్లలు.

కలెక్షన్ల కోసం కక్కుర్తి.. భావితరాల పరిస్థితి ఏంటి?
ఇప్పుడున్న చిన్న పిల్లలు ఈ పాటలను ఈజీగా క్యాచ్ చేసేస్తున్నారు. అర్థం తెలియకపోయినా ఆ ‘బూతు’ పదాలను పాడుతుంటే తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి ‘అడల్ట్ కంటెంట్ ఉంటేనే సినిమా ఆడుతుంది’ అనే ఒక రాంగ్ సిగ్నల్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. దీంతో ప్రతి సినిమాలో ఒక ‘హాట్ ఐటమ్ సాంగ్’ ఉండటం తప్పనిసరి అయిపోయింది. కంటెంట్ మీద నమ్మకం లేకే మేకర్స్ ఇలాంటి అడ్డదారుల వైపు వెళ్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.

Advertisement

సెన్సార్ బోర్డు నిద్రపోతోందా?
లిరిక్స్‌లో పచ్చిగా బూతులు ఉన్నా, విజువల్స్ లో అసభ్యత రాజ్యమేలుతున్నా సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇస్తోంది? అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న. థియేటర్లలో విజిల్స్ వేయించుకోవడానికి మేకర్స్ పడే ఈ తాపత్రయం, భవిష్యత్తులో సినిమా అంటే కేవలం బూతు అన్న ట్యాగ్ వేయడం ఖాయం.ఏది ఏమైనా కనీసం చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని అయినా పాటల్లో హద్దులు పాటించకపోతే, భవిష్యత్తులో సినిమా రంగానికి ఉన్న గౌరవం మాత్రం మంటగలిసిపోవడం మాత్రం  పక్కా !

also read: కిలాడీ కిచెన్‌లో గ్యాస్ కష్టాలు.. యుద్ధం దెబ్బకు స్టార్ హీరో సైతం విలవిల

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×