E-Paper
Advertisement

Post Offices Scheme: పోస్టాఫీసులో స్టాక్‌ మార్కెట్.. లాభాలు కూడా భారీగానే, ఇంకెందుకు ఆలస్యం

Post Offices Scheme: పోస్టాఫీసులో స్టాక్‌ మార్కెట్.. లాభాలు కూడా భారీగానే, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Post Offices Scheme: దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోస్టాఫీసులకు యాక్టివేట్ అవుతున్నాయి. కేవలం ప్రజలకు సేవలు మాత్రమే కాదు, వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. తాజాగా మ్యూచువల్ ఫండ్స్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఇప్పటికే ఆ తరహా ప్రయోగం మహారాష్ట్రలో సక్సెస్ అయ్యింది. ఇక హర్యానా, పంజాబ్‌లపై ఫోకస్ చేసింది. అంతేకాదు టార్గెట్ 50 కోట్ల మంది కొత్త మదుపరులు.

పోస్టాఫీసులో కొత్త పొదుపు పథకాలు

Advertisement

దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోస్టాఫీసులు రూటు మార్చాయి. ప్రజలకు సేవలతోపాటు వ్యాపార సర్వీసు కూడా అందించనుంది. పెట్టుబడుల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది తపాలా శాఖ. పోస్టాఫీసు అంటే కేవలం ఉత్తరాలు, సేవింగ్స్‌ ఖాతాలకు మాత్రమే ఒకప్పుడు పరిమితం. స్టాక్‌ మార్కెట్‌ లాభాలు సామాన్యులకు అందేలా ప్లాన్ చేసింది.

అందుకోసం తపాలా శాఖ-అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా ఒప్పందం కుదిరింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్టుబడుల విషయంలో కొత్త విప్లవం రాబోతోంది. పోస్టాఫీసులు ప్రజలకు సేవలు అందించడంతోపాటు మ్యూచువల్‌ ఫండ్‌ కేంద్రాలు మారాయి. కేవలం సిటీ ప్రజలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు.

Advertisement

ప్రజలకు సేవలు మాత్రమేకాదు.. లాభాలు కూడా భారీగానే

గ్రామీణ, పట్టణాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ జాతర మొదలైంది. వారి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఎందుకంటే బ్యాంకుల్లో కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని భావిస్తుంటారు. ఈ విషయంలో చాలామంది నమ్మారు, ఆపై సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో 50 కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లు లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి పోస్టాఫీసులు.

గ్రామీణ ప్రాంతాల్లో మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రజలకు అవగాహన పెంచుతోంది. పోస్టాఫీసుల నెట్‌వర్క్‌తో మ్యూచువల్‌ ఫండ్స్ పట్టణాలు, మండలాలు, చివరకు గ్రామీణ ప్రాంతాల్లోకి అడుగుపెడుతున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల్లో దేశంలో అగ్రస్థానంలో ఉంది మహారాష్ట్ర. ఫండ్‌ ఆస్తుల్లో 40 శాతం వాటా ముంబై, పుణె నగరాలు ఆక్రమించాయి.

ALSO READ: వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. తులంపై భారీగా కోత.. కొనుగోలుకు ఇదే సరైన సమయమా?

మహారాష్ట్రలోని నాగపూర్, ఔరంగాబాద్‌ జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయానికి తెర తీసింది తపాలా శాఖ. ఇది సక్సెస్ కావడంతో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనుంది. రెండో దశలో పంజాబ్, హర్యానాలను ఎంపిక చేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10వేల మంది పోస్టల్‌ ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఎంపికైన వారికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ ట్రైనింగ్ ఇవ్వనుంది.

గుర్తింపు పొందిన పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్‌ ఫండ్ పథకాలను విక్రయిస్తారు. మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తుల్లో 80 శాతం నగరాల నుంచి వస్తున్నాయి. 60 శాతం మందికి అవగాహన ఉన్నా నష్టపోతామనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. కేవలం 7 శాతం అంటే 6 కోట్ల మంది పెట్టుబడి పెడుతున్నారు. దీన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని ఓ అంచనా.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×