E-Paper
Advertisement

Mark Zuckerberg:- మార్క్ జుకెర్‌బర్గ్‌కు యూఎస్ సెనేటర్స్ వార్నింగ్..

Mark Zuckerberg:- మార్క్ జుకెర్‌బర్గ్‌కు యూఎస్ సెనేటర్స్ వార్నింగ్..
Advertisement

Mark Zuckerberg:- సోషల్ మీడియా అనేది ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. వాట్సాప్‌లో ఉండే స్టేటస్ అప్డేట్స్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఉండే రీల్స్ లాంటి ఫీచర్స్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. వారిని చూసి టీనేజర్లు కూడా ఈ సోషల్ మీడియా యాప్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. అయితే టీనేజర్లు.. సోషల్ మీడియా వినియోగంపై జాగ్రత్తలు వహించాలని, ఆ బాధ్యతను యాజమాన్యమే నిర్వర్తించాలని యూఎస్ సెనేటర్స్ హెచ్చరించారు.

వర్చువల్ టెక్నాలజీకి ఈరోజుల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలాగానే దీనికి కూడా యవతతో పాటు టీనేజర్లు కూడా అడిక్ట్ అవుతున్నారు. యూజర్లను అట్రాక్ట్ చేయడం కోసం వర్చువల్ టెక్నాలజీ మేకర్స్.. మెటావర్స్ అనే కొత్త లోకాన్నే సృష్టించారు. నిజ జీవితంలో చేసే ఎన్నో పనులను, చేయాలనుకొని చేయలేని పనులను మెటావర్స్‌లో చేయడానికి అవకాశం లభిస్తోంది. అయితే టీనేజర్లకు ఇందులో అనుమతి ఉండకూడదని అమెరికా ప్రభుత్వం కచ్చితంగా చెప్పింది.

Advertisement

మెటా ఫౌండర్, సీఈఓ అయిన మార్క్ జుకెర‌్‌బర్గ్ యూఎస్ సెనేటర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే మెటావర్స్ అందరికీ అందుబాటులో ఉండగా.. టీనేజర్ల కోసం కూడా ప్రత్యేకంగా మెటావర్స్‌ను ఏర్పాటు చేయాలని మార్క్ సన్నాహాలు చేస్తున్నాడు. అయితే టీనేజర్ల కోసం మెటావర్స్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉండడం మంచిది కాదని సెనేటర్లు తేల్చి చెప్పారు. త్వరలోనే 13 నుండి 17 వయసున్న వారికి మెటావర్స్ అందుబాటులో తేవాలనుకున్న మార్క్‌కు పెద్ద షాకే తగిలింది.

యూఎస్ సెనేటర్లు అయిన రిచార్డ్ బ్లూమెంథాల్, ఎడ్ మార్కే.. టీనేజర్ల కోసం ఏర్పాటు చేయాలనుకుంటున్న మెటావర్స్ ప్లాన్స్‌ను ఆపేయాలని మార్క్‌ను లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. సంస్థకు లాభం చేకూరడం కోసం ప్రమాదకరమైన టెక్నాలజీని టీనేజర్ల దృష్టికి తీసుకెళ్లడం మంచిది కాదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే మెటా ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2022లో మెటా 13.7 బిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని చూసింది. ఆ నష్టాన్ని లాభంగా మార్చడానికి మెటావర్స్ ఐడియాతో ముందుకొచ్చింది. ఇప్పుడు దీనికి కూడా బ్రేక్ పడనుంది.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×