E-Paper
Advertisement

Smart Toilets : హెల్త్ మానిటర్లుగా మారనున్న టాయిలెట్లు.. యూరాలాజికల్ సమస్యల కోసం..

Smart Toilets : హెల్త్ మానిటర్లుగా మారనున్న టాయిలెట్లు.. యూరాలాజికల్ సమస్యల కోసం..
Advertisement
smart toilets

Smart Toilets : ఈరోజుల్లో మనుషులంతా చాలావరకు తమ ఆరోగ్య సమస్యల గురించి ఇంట్లో ఉండే తెలుసుకోవాలని అనుకుంటున్నారు. దానికోసమే వారు స్మార్ట్ డివైజ్‌లపై ఆధారపడుతున్నారు. కానీ అన్ని ఆరోగ్య సమస్యల గురించి అలా తెలుసుకోవడం సులభం కాదు.. కొన్నింటి కోసం ఆసుపత్రులకు వెళ్లాలి. టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టుల రిజల్ట్ వచ్చేవరకు ఎదురుచూడాలి. అలా కాకుండా ఉండడం కోసమే కొత్త రకమైన టాయిలెట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

Advertisement

యూరాలాజికల్ సమస్యలను ఇంట్లోనే కనిపెట్టడం కోసం స్మార్ట్ టాయిలెట్లను తయారు చేసింది ఒక స్మార్టప్ కంపెనీ. ఈరోజుల్లో బీపీ, గ్లూకోజ్ లెవల్స్ వంటి విషయాలను కనుక్కోవడానికి ఇంట్లోనే ఎన్నో రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే యూరాలాజికల్ హెల్త్ బాగుందా లేదా, దానికి సంబంధించిన ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ టాయిలెట్లను తయారు చేస్తున్నట్టు కేర్‌టెక్ హ్యూమన్ కంపెనీ బయటపెట్టింది.

ఈరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ ద్వారా ఎంతమంది బాధపడుతున్నారో.. యూరాలాజికల్ సమస్యల వల్ల కూడా అంతేమంది బాధపడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. కానీ డయాబెటీస్ గురించి తెలుసుకున్నంత సులువుగా ఈ సమస్యల గురించి తెలుసుకోవడం కుదరదని అన్నారు. అందుకే కేర్‌టెక్ హ్యామన్ కంపెనీ టాయిలెట్ మీద ఇన్‌స్టాల్ చేయగలిగే ఒక చిన్న పరికరాన్ని తయారు చేస్తున్నారు. ఇది మనిషి యూరిన్‌కు సంబంధించిన ప్రతీ ఒక్క సమాచారాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. యూరాలాజికల్ సమస్యల గురించి తెలుసుకోవడం కోసం ఈ డేటా అనేది ఉపయోగకరంగా మారుతుంది.

Advertisement

స్మోక్ డిటెక్టర్ లాంటి టెక్నాలజీతో ఈ టాయిలెట్ పరికరం పనిచేస్తుందని కేర్‌టెక్ హ్యామన్ కంపెనీ యాజమాన్యం తెలిపింది. ప్రతీ ఒక్క హెల్త్ ప్యారామీటర్‌ను ఈ పరికరం పాటిస్తుందని చెప్పింది. మనుషుల యూరాలాజికల్ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఈ పరికరంలో రికార్డ్ అయ్యే డేటా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. ఎమర్జెన్సీ సమయాల్లో కూడా ఈ డేటా ఉపయోగపడుతుందని చెప్తుంది. టాయిలెట్స్ అనేది హెల్త్ మానిటర్స్‌గా పనిచేయడం అనేది ఇదే మొదటిసారి అని కేర్‌టెక్ హ్యామన్ అంటోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×