E-Paper
Advertisement

Scientist:-ఆకాశాన్ని కమ్మేస్తున్న శాటిలైట్లు.. ప్రమాదాల హెచ్చరిక..

Scientist:-ఆకాశాన్ని కమ్మేస్తున్న శాటిలైట్లు.. ప్రమాదాల హెచ్చరిక..
Advertisement

Scientist:- శాస్త్రవేత్తలు ఎప్పుడూ మనుషులు జీవన విధానాన్ని పెంపొందించడానికి మాత్రమే పాటుపడుతుంటారు. కానీ ఈ క్రమంలో ప్రకృతికి నష్టం జరిగే పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు వారి వల్ల కాలుష్యం పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. తాజాగా శాటిలైట్ల వల్ల కూడా ప్రమాదకరమైన శాతంలో లైట్ పొల్యూషన్ అనేది పెరిగపోతుందని వారు గమనించారు. దానిపై చర్చలు తీసుకోవడానికి వారు సిద్ధమయ్యారు.

శాస్త్రవేత్తలు గాలిలోకి పంపిస్తున్న లో ఎర్త్ ఆర్బిట్ (లియో) శాటిలైట్ల వల్ల లైట్ పొల్యూషన్ అనేది పెరిగిపోతుందని వారు గమనించారు. ఎలన్ మస్క్ స్పేస్‌లోకి పంపించిన స్టార్‌లింక్ శాటిలైట్‌నే వారు ఉదాహరణగా తెలిపారు. ఇది డార్క్ నైట్‌పై ప్రయోగాలు చేయాలనుకునే ఆస్ట్రానాట్స్‌కు ఇబ్బందిగా మారిందని వారు వాదిస్తున్నారు. శాటిలైట్లు అనేవి స్పేస్ స్టడీకి ఉపయోగపడినా కూడా వాటి వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని వారు విమర్శిస్తున్నారు. భారీ సంఖ్యలో శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించడమే దీనికి కారణమన్నారు.

Advertisement

శాటిలైట్ల వల్ల ఏర్పడుతున్న లైట్ పొల్యూషన్‌ను కంట్రోల్ చేయాలంటే ఫీల్డ్‌కు చేరుకోగానే టెలిస్కోప్ లైట్ల వెలుగును తగ్గించడం కానీ, లేక పూర్తిగా ఆపేయడం కానీ చేస్తే మంచిదని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. శాటిలైట్లు ఎక్కువగా లేని చోట లైట్లు ఆపివేయడం వల్ల ఎలాంటి నష్టం జరగదన్నారు. కానీ ఇలా చేసినా కూడా లైట్ పొల్యూషన్ సమస్యకు చెక్ పడదని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. కేవలం లైట్ పొల్యూషన్ మాత్రమే కాకుండా అంతరిక్షంలో మరెన్నో ఇతర సమస్యలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు.

ఆర్బిట్‌లో ట్రాఫిక్, స్పేస్‌లో ఉన్న చెత్త వల్ల ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యం, రాకెట్ల వల్ల వెలువడుతున్న హానికరమైన గ్యాస్‌లు.. ఇలాంటి సమస్యలు అన్ని అలాగే ఉండిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. డార్క్ నైట్ స్కై మీద పరిశోధనలు చేయడం ముఖ్యమని, లైట్ పొల్యూషన్ వల్ల ఆ పరిశోధనలు ఆగిపోతే.. మానవాళికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. అంతే కాకుండా ఇది ప్రకృతికి కూడా ప్రమాదకరమని అన్నారు.

Advertisement

ఇదే సంఖ్యలో శాటిలైట్లు పెరిగిపోతూ ఉంటే.. అవి ఎల్లప్పుడూ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయని, అప్పుడు భూమి మీద జీవించే మానవాళికి నైట్ స్కై అనేది కనిపించకుండా పోతుందని కొందరు వాపోతున్నారు. అందుకే దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్క ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ నుండే 3 వేల నుండి 5 వేల యాక్టివ్ శాటిలైట్లు లియోలో తిరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక చైనా, రష్యా అయితే శాటిలైట్ల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు. అందుకే వీటిపై చర్యలు తీసుకోవడానికి ఆస్ట్రానాట్స్ సిద్ధమవుతున్నారు.

స్పేస్‌కు వెళ్లొద్దాం..! 2030 నుండి ప్రయాణం..

for more updates follow this link:-bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×