E-Paper
Advertisement

Elon Musk : బ్లూ టిక్‌పై ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం..

Elon Musk : బ్లూ టిక్‌పై ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం..
Advertisement
Elon Musk

Elon Musk : ఒకప్పుడు సోషల్ మీడియా యాప్స్ అన్నింటితో పోలిస్తే.. ట్విటర్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. కానీ మెల్లమెల్లగా దాని క్రేజ్ అంతా పోయి.. అందరూ దానిపై జోక్‌లు వేసే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఎలన్ మస్క్.. ట్విటర్‌కు సీఈఓగా మారిన తర్వాత ఆయన చేసిన మార్పులు చూసి యూజర్లు సైతం నవ్వుకున్నారు. తాజాగా ట్విటర్‌లో మరో మార్పు జరగనున్నట్టు సమాచారం. ఎలన్ మస్క్ స్వయంగా ప్రారంభించిన ఒక ఫీచర్‌ను తానే తొలగించనున్నట్టు తెలుస్తోంది.

ఏప్రిల్ 1 నుండి ట్విటర్ అందించిన బ్లూ టిక్స్‌ను వెనక్కి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎలన్ మస్క్ సీఈఓగా పదవిని స్వీకరించిన తర్వాత ట్విటర్ బ్లూ లీగసీ బ్లూ టిక్స్ పేరుతో చాలామంది అకౌంట్స్‌కు బ్లూ టిక్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాటిని తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికీ బ్లూ టిక్ కావాలనుకునేవారు ఒక ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగమవ్వాలని ట్విటర్ యాజమాన్యం అంటోంది. ఏప్రిల్ 1 నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisement

ట్విటర్ బ్లూలో సైన్ అప్ చేయడం వల్ల వారి బ్లూ టిక్స్‌ను కాపాడుకునే అవకాశం ఉందని యాజమాన్యం.. యూజర్లకు తెలిపింది. ఈ విషయాన్ని వారే స్వయంగా ట్వీట్ ద్వారా బయటపెట్టారు. ట్విటర్ బ్లూ ప్రోగ్రామ్ ద్వారా బ్లూ టిక్స్ పొందాలనుకునేవారు నెలకు రూ.900 కట్టాల్సి ఉంటుంది. బ్లూ టిక్ కావాలనుకునే చాలామంది ఈ మొత్తాన్ని కట్టడానికి కూడా వెనకాడలేదు. అందుకే చాలామంది ట్విటర్ ప్రొఫైల్స్ పక్కన బ్లూ టిక్స్ దర్శనమిస్తుంటాయి.

సంవత్సరం మొత్తానికి ఒకేసారి బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకునేవారికి 12 శాతం డిస్కౌంట్ కూడా అందజేసింది ట్విటర్ యాజమాన్యం. అలాగే ఇప్పుడు ట్విటర్ బ్లూ ఫీచర్‌లో కూడా డబ్బు కడితేనే బ్లూ టిక్ పొందే అవకాశం లభిస్తోంది. ట్విటర్ బ్లూ ద్వారా బ్లూ టిక్ పొందాలనుకునే ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు 11 డాలర్లు కట్టాలని, వెబ్ యూజర్లు 8 డాలర్లు కట్టాలని ట్విటర్ యాజమాన్యం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ రేట్లు అమెరికా వరకే బయటపెట్టింది. ఇతర దేశాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×