E-Paper
Advertisement

Netizens Fire On Musk : ఆడుకోవద్దంటూ మస్క్‌పై ఆగ్రహం

Netizens Fire On Musk : ఆడుకోవద్దంటూ మస్క్‌పై ఆగ్రహం
Advertisement

Netizens Fire On Musk : ట్విట్టర్ కొన్నాక తన నిర్ణయాలు, చర్యలతో తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు… ఎలాన్ మస్క్. ఆయన తీరును నెటిజన్లు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. అయినా మస్క్ వైఖరి మాత్రం మారడం లేదు. మరోసారి మస్క్ తలతిక్క నిర్ణయాలు బయటికి రావడంతో… ఇదేం పద్ధతి అంటూ అంతా మస్క్‌కు చివాట్లు పెడుతున్నారు.

మస్క్‌ కారణంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ ఓ ట్విట్టర్ ఉద్యోగి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది చూసిన నెటిజన్లంతా మస్క్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే… ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన మస్క్‌, వారిలో కొందరిని మళ్లీ నియమించుకున్నారు. అలా చేర్చుకున్న వారిలో ఇప్పుడు కొందర్ని తీసేశాడు. అలా ఉద్యోగం పోగొట్టుకున్న బ్లైండ్‌ అనే వ్యక్తి… ఆ చేదు అనుభవాన్ని వివరిస్తూ ఓ పోస్ట్ చేశాడు. కొత్త ఉద్యోగం వెతుక్కునే విషయంలో తనకు ఎవరైనా సాయం చేయమని కోరాడు. ఈ పోస్ట్‌ స్క్రీన్‌షాట్‌ను రెడిట్‌ ఉద్యోగి పీటర్ యాంగ్‌ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో… అది కాస్తా వైరల్‌గా మారింది. దాంతో… ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దంటూ అంతా మస్క్‌కు చివాట్లు పెడుతున్నారు.

Advertisement

ట్విటర్‌కు బాస్ అయ్యాక… నవంబరు తొలి వారంలో వేల మంది ఉద్యోగులను తొలగించాడు… మస్క్. వారిలో బ్లైండ్ కూడా ఉన్నాడు. అయితే… తనకు ప్రత్యేకమైన ప్రతిభ ఉందని… డాక్యుమెంటేషన్‌, కోడ్ శాంపిల్స్‌లో తన సేవల అవసరం సంస్థకు ఉందని చెప్పి… తనను ట్విట్టర్ మళ్లీ విధుల్లోకి తీసుకుందని బ్లైండ్ రాసుకొచ్చాడు. ఉన్నట్టుండి ఇప్పుడు రాత్రికి రాత్రి ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని, భృతిగా 4 వారాల జీతం ఇస్తామని చెప్పారని బ్లైండ్ ఆవేదన వ్యక్తం చేశాడు. H1B వీసా మీద ఉన్న తనకు ఎవరైనా సాయం చేయాలని కోరాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మస్క్‌ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తీసేయాలనుకుంటే ఒకసారి తీసెయ్ కానీ, ఇలా ఉద్యోగుల పొట్ట మీద కొట్టేలా వారి జీవితాలతో ఆడుకోవద్దంటూ హితవు పలుకుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×