E-Paper
Advertisement

Fig Fruit Benefits : క్యాన్సర్లను అడ్డుకునే అంజీర్‌ పండ్లు

Fig Fruit Benefits : క్యాన్సర్లను అడ్డుకునే అంజీర్‌ పండ్లు
Advertisement

Fig Fruit Benefits : అత్తి పండ్లు… వీటినే అంజీర్ పండ్లు అని కూడా అంటారు. వీటిలో లేత పింక్ లేదా ముదురు పింక్ రంగులో విత్తనాలు, గుజ్జు ఉంటాయి. పైభాగంలో ఆకుపచ్చ, పర్పుల్‌, నీలం రంగును కలిగి ఉంటాయి. మనకు మార్కెట్లో ఈ పండ్లు డ్రైఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. చూసేందుకు అంత బాగా అనిపించవు. కానీ నిజానికి ఈ పండ్ల వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అత్తి పండ్లను తినడం వల్ల మన జీవన వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. అంతేకాకుండా అంజీర్ పండ్లు శరీరంలోని కొలస్ట్రాల స్థాయిలను తగ్గిస్తాయి. వీటిని నిత్యం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె సురక్షితంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు డ్రై అంజీర్ పండ్లను తినకూడదు. కానీ మామూలు పండ్లను తినవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఈ అంజీర్ పండ్లలో ఉండే పోషకాలు పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. అంజీర్ పండ్లను తరచూ తినడం వల్ల కోలన్‌, బ్రెస్ట్, లివర్, సర్వికల్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. డెర్మటైటిస్ సమస్య ఉన్నవారు, పొడి చర్మం ఉన్నవారు, చర్మం దురదలు వచ్చేవారు ఈ అంజీర్ పండ్లను తినడం వల్ల ఆ సమస్యలు తగ్గిపోతాయి. అయితే అంజీర్ పండ్లు మలబద్దకానికి మంచివే అయినా కొందరిలో ఇవి రివర్స్‌లో పనిచేస్తాయి. అంటే వీటిని తినడం వల్ల మలబద్దకానికి బదులు విరోచనాలు అవుతాయి. అలాంటి సమస్య ఉత్పన్నమైతే ఈ పండ్లను తినడం మానేయాలి. రక్తం పలుచబడినందుకు టాబ్లెట్లు వేసుకునేవారు ఈ పండ్లను తినే ముందు వైద్యులను సంప్రదిస్తే మంచిది. మరికొందరిలో అలర్జీ సమస్యలు కూడా తలెత్తుతాయి. 40 గ్రాముల అంజీర్ పండ్లలో 30 గ్రాముల క్యాలరీలు, 8 గ్రాముల పిండి పదార్థాలు, మూడు శాతం కాపర్, రెండు శాతం మెగ్నీషియం, పొటాషియం, థయామిన్, విటమిన్ బి 6, విటమిన్ కె ఉంటాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×