E-Paper
Advertisement

Artificial Muscles : మరింత సురక్షితంగా కృత్రిమ కండరాల తయారీ..

Artificial Muscles : మరింత సురక్షితంగా కృత్రిమ కండరాల తయారీ..
Advertisement
Artificial Muscles

Artificial Muscles : మనిషి శరీరంలో ఇతర అవయవాల లాగానే కండరాలు కూడా ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తాయి. దేనినైనా పట్టుకోవడానికి, వస్తువులను ఎత్తడానికి.. ఇలా ఎన్నో విషయాలకు కండరాలు ఉపయోగపడతాయి. అయితే కండరాలు చేసే పనులన్నీ చేయడానికి శాస్త్రవేత్తలు ఇప్పటకే కృత్రిమ కండరాలను తయారు చేశారు. కానీ అది పూర్తిస్థాయిలో వారు అనుకున్నట్టుగా పనిచేయలేదు. అందుకే దానిపై ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

కృత్రిమ కండరాలు అనేవి బాగానే పనిచేసినా కూడా వాటికోసం ఎక్కువ వోల్టేజ్‌తో కరెంటు కావాల్సి వస్తుంది. అయితే కరెంటు తగ్గిస్తూ కృత్రిమ కండరాలు మెరుగ్గా పనిచేసేలా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతే కాకుండా మెడికల్ పరికరాల్లో కూడా ఈ కృత్రిమ కండరాలు ఉపయోగపడేలాగా మార్చాలని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కృత్రిమ కండరాలు అనేవి రోబోలలో కూడా శక్తిని నింపి, వాటిలో మరిన్ని కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయడానికి సహాయపడుతుంది.

Advertisement

ప్రస్తుతం కృత్రిమ కండరాలకు ఉపయోస్తున్న పోలిమర్స్‌ను మారిస్తే.. కరెంటు వినియోగం చాలావరకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఇప్పుడు కృత్రిమ కండరాల కోసం ఉపయోగిస్తున్న పోలిమర్స్.. ఎక్కువ లావుగా ఉంటున్నాయి. అలా కాకుండా వాటిని కొంచెం సన్నగా చేస్తే వోల్టేజ్ తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అందుకే వారు సన్నటి పోలిమర్స్ తయారీలో నిమగ్నమయి ఉన్నారు.

సన్నటి పోలిమర్స్‌ను తయారు చేసే క్రమంలో శాస్త్రవేత్తలు దాదాపు సక్సెస్ అయ్యారు. కానీ వీటిని కృత్రిమ కండరాల తయారీలో పూర్తిస్థాయిలో ఉపయోగించడానికి మరికొంత సమయం పడుతుందని వారు తెలిపారు. ఒకవేళ ఆ ప్రయోగం కూడా సక్సెస్ అయితే.. మరిన్ని మెడికల్ పరికరాల తయారీలో ఈ పోలిమర్స్‌ను ఉపయోగించవచ్చని వారు అంటున్నారు. ఈ పరిశోధనలకు సాయంగా ఉండడానికి పలు సంస్థలు పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×