E-Paper
Advertisement

Lemon Mosquitoes : నిమ్మ రసంతో ఇంట్లోని దోమలు పరార్‌!

Lemon Mosquitoes : నిమ్మ రసంతో ఇంట్లోని దోమలు పరార్‌!
Advertisement

Lemon Mosquitoes : వేసవికాలం వచ్చిందంటే చాలు తాపం తగ్గించుకోవడానికి నిమ్మరసం తాగుతుంటాం. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించి మనలో తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. విట‌మిన్ సి,బి, యాంటీ యాక్సిడెంట్లు, కాల్షియం ఈ నిమ్మకాయల్లో ఉంటాయి. దీంతో పాటు మన ఇంట్లో అనేక పనులకు నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. మ‌ర‌క‌ల‌ను పోగొట్టడంతో పాటు చాలా పనులకు నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. దోమల బెడద ఎక్కువగా ఉంటే కాయిల్స్‌ లేక జెట్‌లు, రకరకాల స్ప్రేలు వాడుతుంటారు. కానీ వాటి వాసన, పొగ చాలా మందికి పడదు. అంతేకాకుండా అలర్జీలు కూడా వస్తాయి. వీటికి చక్కటి పరిష్కారం నిమ్మ. దోమలు రాకుండా ఇంట్లోనే నిమ్మరసంతో రెమెడీ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకొని దాంట్లో కొన్ని లవంగాలు వేసి ఇంట్లో ఒక మూలన పెడితే దోమలు మీ ఇంటి దరిదాపులోకి కూడా రావు. అంతేకాకుండా రూమ్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. నీళ్లలో నిమ్మతొక్క లేదా రసం వేసి మరిగిస్తే ఇళ్లంతా సువానస వెదజల్లుతుంది. కిచెన్‌, బాత్‌రూమ్‌ను శుభ్రం చేయడానికి కూడా నిమ్మరసాన్ని వినియోగించవచ్చు. నీళ్లు, నిమ్మరసం సమానంగా ఒక స్ప్రే బాటిల్‌లోకి తీసుకుని మరకలను శుభ్రం చేసుకోవచ్చు. ఫ్రిజ్‌పై పడిన మ‌ర‌క‌ల‌ను కూడా ఇది తొలగిస్తుంది. ప్రతిరోజు కూర‌గాయ‌లు, పండ్లు క‌ట్ చేయ‌డంతో చాపింగ్ బోర్డుపై మరకలు పడుతుంటాయి. వాటిని నిమ్మతొక్కతో గట్టిగా రుద్ది కడిగితే వెంటనే తొలగిపోతాయి. ఏదైనా నూనెలో నిమ్మరసం కలిపి స్ర్పే చేస్తే క్రిములు, కీట‌కాలు కూడా దగ్గరికి రావు. అంతేకాకుండా బేకింగ్‌ సోడాలో నిమ్మరసం కలిపి పళ్లుతోముకుంటే తెల్లగా మెరుస్తాయి. యాపిల్‌ కట్‌చేసిన తర్వాత నిమ్మరసం చల్లితే చాలాసేపటి వరకు తాజాగా ఉంటుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×