E-Paper
Advertisement

Milk : పాలల్లో ఇది కలిపి తాగితే మోకాళ్ల నొప్పులు మాయం

Milk : పాలల్లో ఇది కలిపి తాగితే మోకాళ్ల నొప్పులు మాయం
Advertisement

Milk : ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తహీనత వస్తున్నాయి. అంతేకాకుండా అధిక బరువు, నిద్రలేమి సమస్యలతో కూడా బాధపడుతుంటారు. కాల్షియం లోపం వల్లే ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ పదార్థాలను పాలతో కలిపి తీసుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. క్యాల్షియం లోపంతో నరాల బలహీనత, ఎముకలు బలహీనంగా మారతాయి. అంతేకాకుండా సిరలో అడ్డంకులు వల్ల కండరాల్లో వాపు కూడా వస్తుంది. కనీసం కూర్చొని లేవలేని పరిస్థితి ఉంటుంది. అందుకే వైద్యులు కాల్షియం మాత్రలను వాడమని చెబుతుంటారు. సమస్య చిన్నదైతే మాత్రం మన ఇంట్లోనే చిట్కాలను పాటించవచ్చు. 40 ఏళ్లు దాటివారంతా ఈ పాలను ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో గ్లాస్ పాలు పోసి వేడెక్కాక ఒక స్పూన్ సొంపు వేయాలి. ఈ సోంపు మన శరీరంలో రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాకుండా రక్తపోటు, జీర్ణ సంబంధ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీంతో పాటు ఆ పాలల్లో చిన్న అల్లం ముక్క కూడా రుబ్బుకొని వేసుకోవాలి. అల్లం రోగ నిరోధక శక్తితో పాటు ఆకలిని పెంచుతుంది. ఒక దాల్చినచెక్క ముక్కను కూడా వేసుకుంటే అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపుతుంది. నరాల వాపు, కండరాల వాపును తగ్గించడంలో దాల్చినచెక్క అద్భుతంగా పనిచేస్తుంది. చివర్లో ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు మాత్రం వాడకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక 8 నిమిషాల పాటు మరిగించాలి. బెల్లంలో ఉండే కాల్షియం వల్ల ఈ పాలు తాగితే నొప్పులన్నీ పోతాయి. అంతేకాకుండా మన శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. బెల్లంలోని ఐరన్ వల్ల రక్త హీనత ఉండదు. ఈ పాలను ఏ సమయంలోనైనా తాగొచ్చని చెబుతున్నారు. అదే సమస్య పెద్దగా ఉంటే వైద్యుని సలహా మేరకు వ్యవహరించాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×