E-Paper
Advertisement

Indian Railways: టికెట్ బుకింగ్ కు కష్టపడక్కర్లేదు.. సూపర్ యాప్ తెస్తోన్న ఇండియన్ రైల్వే..

Indian Railways: టికెట్ బుకింగ్ కు కష్టపడక్కర్లేదు.. సూపర్ యాప్ తెస్తోన్న ఇండియన్ రైల్వే..
Advertisement

Indian Railways: ఉద్యోగం, పనుల నిమిత్తం సొంతూరికి దూరంగా ఉండేవారంతా ఎక్కువగా రైలు ప్రయాణాలనే ఇష్టపడతారు. కానీ.. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం అంత సులువు కాదు. ఎప్పుడు ఏ ట్రైన్ చూసినా.. వెయిటింగ్ లిస్టే కనిపిస్తుంటుంది. ఇక పండగల సమయంలో అయితే వాటిగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2-3 నెలల ముందు నుంచే వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తుంది. రద్దీ సమయాల్లో రిగ్రెట్ కూడా అయిపోతాయి. స్పెషల్ ట్రైన్లు వేసినా.. అవి దొరకడం కష్టమే.

టికెట్ బుకింగ్ కు ఒక యాప్, కంప్లైంట్స్ కు మరో యాప్, జనరల్ టికెట్లకు ఇంకొక యాప్, రన్నింగ్ స్టేటస్, పీఎన్ఆర్ స్టేటస్ లు చూసుకోవడానికి వేర్వేరు యాప్ లు. ఇలా ఒక రైలులో ప్రయాణం చేయాలంటే నాలుగైదు యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. భారతీయ రైల్వే.. ఈ సేవలన్నింటినీ ఒకేవేదికపైకి తెచ్చేందుకు ఒక సూపర్ యాప్ ను అభివృద్ధి చేస్తోందట. ఇండియన్ రైల్వేకు సంబంధించి అన్నిరకాల సేవలను ఒకే చోట అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనికోసం రైల్వేశాఖ ఏకంగా రూ.90 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది.

Advertisement

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS)దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. యూజర్లు పలు యాప్ లను డౌన్ లోడ్ చేసుకునే అవసరం ఉండదని, అన్ని రకాల సేవలు ఒకే యాప్ లో ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. యూజర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా యాప్ ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×