E-Paper
Advertisement

Honeypot Ant : తేనెటీగలు చూశాం.. తేనె చీమలు ఇవే

Honeypot Ant : తేనెటీగలు చూశాం.. తేనె చీమలు ఇవే
Advertisement

Honeypot Ant : ఇప్పటి వరకు మనకు తేనె అనగానే తేనెటీగలే గుర్తొస్తాయి. తేనె వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సాధారంగా చీమలు అంటే తీపి తింటాయని, కొద్దిగా తీపి ఉంటే వందలకొద్దీ చీమలు చేరతాయి. కానీ అయితే ఓ చీమ జాతి మాత్రం దీనికి భిన్నంగా తేనె తయారు చేసుకుని వాటి బొజ్జల్లో దాచుకుంటున్నాయి. వాటి పేరు హనీపాట్‌ చీమలు. కొన్నిసార్లు హనీపాట్‌ చీమలు తమ పొట్టలో చాలా తేనెను దాచుకుని పెద్దగా మారుతాయి. ఆ సమయంలో అధికంగా బరువు ఉండటం వల్ల ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లడం కూడా వాటికి కష్టంగా మారుతుంది. ఇక చేసేదేమీ లేక అవి ఒకేచోట వేలాడుతూ ఉండిపోతాయి. ఇదే అదునుగా ఇతర రకాల చీమలు వీటిపై దాడి చేసి తేనె లాగేసుకుంటాయి. చీమలకే కాకుండా ఇతర జీవులకు కూడా ఈ హనీపాట్‌ చీమల పుట్టలే ప్రధాన ఆహార వనరుగా మారిపోతాయి. హనీపాట్ చీమలు తేనెను తయారు చేయడమే కాకుండా తేనెటీగల్లా ఒకేచోట ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆహారం కోసం తేనెను తయారు చేసుకుని పొట్టభాగంలో దాచుకుంటాయి. కేవలం తనకోసమే కాకుండా తమ జాతిమొత్తానికి సరిపడేలా ఇవి తేనెను తయారుచేస్తుంటాయి. వీటి తేనె బంగారు రంగులో ఉంటుంది. ఏదైనా ఆహారం కొరత వస్తే మాత్రం కడుపులోకి తేనె తీసి మిగతా చీమలకు పంచుతాయి. ఈ చీమల శాస్త్రీయనామం కాంపోనోటస్ ఇన్‌ఫ్లాటస్. ఆస్ట్రేలియా దేశాల్లో ఈ చీమల తేనెను ఎక్కువగా ఆహార పదార్థాలలో వాడుతారు. తేనెటీగల తేనె కంటే వీటి తేనె కొంచెం పలుచగా ఉంటుంది. రుచిలో కూడా తేడాలు ఉంటాయి. ఈ హనీపాట్‌ చీమలు ఆస్ట్రేలియాతో పాటు ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఆయా ప్రాంత ప్రజలు వీటి పుట్టల నుంచి తేనెను సేకరిస్తారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×