E-Paper
Advertisement

Electric Vehicles : అధిక బరువు వల్ల రేంజ్ తగ్గిపోతున్న ఎలక్ట్రిక్ వాహనాలు..

Electric Vehicles : అధిక బరువు వల్ల రేంజ్ తగ్గిపోతున్న ఎలక్ట్రిక్ వాహనాలు..
Advertisement

Electric Vehicles : ఒకప్పుడు కార్లలో పెట్రోల్ కార్లను కొనాలా..? డీజిల్ కార్లను కొనాలా..? అనే కన్ఫ్యూజన్ కస్టమర్లలో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఒకవేళ మనం ఏ బండి కొనాలి అనుకున్నా అది ఎలక్ట్రిక్ అయితే బెటర్ అని చాలామంది కస్టమర్లు ఫిక్స్ అయిపోయారు. ఎలక్ట్రిక్ కార్లపై పెరుగుతున్న క్రేజ్ చూసి ఆటోమొబైల్ సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తున్నా కూడా.. నిపుణులు మాత్రం ఇందులో ఉండే లోపాలపై దృష్టిపెట్టారు.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా కార్గోను నింపడం వల్ల వాటి రేంజ్ మెల్లగా తగ్గిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం కార్లు అనే కాదు.. ఈమధ్య ట్రక్కులు లాంటి భారీ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ సామర్థ్యంతో నడుస్తుండడంతో అందులో అయినా భారీ కార్గో పెట్టుకొని ప్రయాణించడం రేంజ్ తగ్గిస్తుందని వారు భావిస్తున్నారు. మామూలుగా ఏ వాహనంలో అయినా ఎంత బరువు ఎక్కించాలి అనేదానిపై ఒక మ్యాక్సిమమ్ కెపాసిటీ ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ ట్రక్కులలో మ్యాక్సిమమ్ కెపాసిటీకి 100 పౌండ్లు బరువు తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాని రేంజ్ 25 శాతం తగ్గిపోతుందని తెలుస్తోంది.

Advertisement

రేంజ్ అనేది కూడా ఫ్ల్యూయల్ వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఒక కారణంగా మారుతుందని నిపుణులు బయటపెట్టారు. పెట్రోల్, డీజిల్ వాహనాల్లో కూడా అధిక బరువు అనేది కీలక పాత్ర పోషిస్తుందని వారు గుర్తుచేసుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం ఒక 2022 ఫోర్డ్ ఎఫ్ 150 ఎలక్ట్రిక్ ట్రక్కును నడిపి చూశారు. ఇందులో మొత్తంగా 1400 పౌండ్ల బరువు ఉన్న ఇసుక బస్తాలను వేశారు. ఇందులో మ్యాక్సిమమ్ కెపాసిటీ కంటే కేవలం 110 పౌండ్లు మాత్రమే తక్కువ ఉంది.

ఎఫ్ 150 అనేది ప్రస్తుతం ఎలక్ట్రిక్ ట్రక్కులలో ట్రెండింగ్‌లో ఉన్న వెహికిల్. ఇది ఒకేసారిగా 1,50,000 ప్రొడక్షన్ గోల్‌ను సాధించింది. అయితే ఈ ట్రక్కు ద్వారా వారు చేసిన పరిశోధనలో అధిక బరువు ఉండడం వల్ల ట్రక్కు రేంజ్ 24.5 శాతం తగ్గినట్టు వారు గమనించారు. అంటే 278 మైళ్ల నుండి 210 మైళ్లు తగ్గిందని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే వాహనాల మీద అధిక బరువు పెట్టగానే వాటికి ముందుకు కదలడానికి ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అందుకే వాటి రేంజ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×