E-Paper
Advertisement

Mankind IPO :ఐపీవోకు మరో అతిపెద్ద ఫార్మా కంపెనీ… మ్యాన్‌కైండ్‌కు అప్లై చేయొచ్చా

Mankind IPO :ఐపీవోకు మరో అతిపెద్ద ఫార్మా కంపెనీ… మ్యాన్‌కైండ్‌కు అప్లై చేయొచ్చా
Advertisement
Mankind IPO

Mankind IPO : ఈ మధ్యకాలంలో ఐపీఓ అంటేనే భయం పట్టుకుంది. ఎల్ఐసీ నుంచి ఏ ఒక్క ఐపీఓ సక్సెస్ అయింది లేదు. మార్కెట్లో మంచి బ్రాండ్ ఉన్న కంపెనీలు సైతం చతికిలపడ్డాయి. పైగా మార్కెట్ పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. అయినా సరే… మ్యాన్ కైండ్ కంపెనీ ధైర్యం చేస్తోంది.

దేశంలోని అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో మ్యాన్ కైండ్ ఒకటి. ఈ కంపెనీకి 25 మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, నాలుగు ఆర్ అండ్ డీ సెంటర్స్, అందులో 600 మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కిట్స్, కాంట్రసెప్టివ్స్, యాంటాసిడ్ పౌడర్స్, విటమిన్స్, మినరల్ సప్లిమెంట్స్, యాంటీ యాక్నే కేటగిరీల్లో మందులు అందిస్తోంది.

Advertisement

మ్యాన్‌కైండ్‌ ఫార్మా ఐపీవో ఈ నెల 25న ప్రారంభమై..27న ముగుస్తుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూట్‌లో ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు చెందిన 40,058,844 ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.1,026 నుంచి రూ.1,080 మధ్య ఉంటుంది. మొత్తం రూ.4,300 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరిస్తోంది. ఈ డబ్బు కంపెనీకి కాకుండా, వాటాలను అమ్మిన ప్రమోటర్లకు వెళ్తుంది.

ప్రైస్ బ్యాండ్ కాస్త ఎక్కువగా ఉన్నందున గ్రే మార్కెట్ ప్రీమియం తక్కువగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఐపీవో ద్వారా సమీకరిస్తున్న ఈ మెుత్తాన్ని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించకపోవటం వల్ల గ్రే మార్కెట్ ప్రీమియం రానున్న కాలంలో మరింత తగ్గవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. అయితే, ఈ నిధులను ప్లాంట్ విస్తరణకు ఉపయోగిస్తామని కంపెనీ చెబుతోంది. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×