E-Paper
Advertisement

Brainwashing:- నిద్రలో బ్రెయిన్ వాషింగ్.. చాలా ముఖ్యం..!

Brainwashing:- నిద్రలో బ్రెయిన్ వాషింగ్.. చాలా ముఖ్యం..!
Advertisement

Brainwashing:- ఈరోజుల్లో మానసిక ఆరోగ్యంపై చాలామంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకే బ్రెయిన్ వాషింగ్ అని చెప్పగానే టక్కున గుర్తుపట్టేసేవారు ఉంటారు. అయితే సాధారణంగా బ్రెయిన్ వాషింగ్ అనేది నెగిటివ్ పదంగా ఉపయోగిస్తుంటారు. కానీ మెదడుకు సంబంధించిన చాలా విషయాలు బ్రెయిన్ వాషింగ్‌కు సంబంధించినవే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలోని ఇది జరుగుతుందని వారు గుర్తించారు.

సరిపడా నిద్ర అనేది మెదడును యాక్టివ్‌గా ఉంచుతుందని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సాధారణంగా అంటుంటారు. అందుకే ఈ కోణంలో క్షుణ్ణంగా పరిశోధనలు చేయాలని యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. మెదడులోని రక్తకణాలు మనిషి నిద్రపోతున్నప్పుడే పలు విధాలుగా కలుస్తాయి, పలు విధాలుగా విడిపోతాయని వారు గమనించారు. మెదడులోని హానికరమైన, అవసరం లేని కణాలను తొలగించడానికి అదే సరైన సమయమని అన్నారు.

Advertisement

మెదడు గురించి క్షుణ్ణంగా స్టడీ చేయడం ద్వారా ఎన్నో అంతుచిక్కని వ్యాధులకు చికిత్సను కనిపెట్టే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందులో అల్జీమర్స్‌తో పాటు మరికొన్ని న్యూరోజెనరేటివ్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఈ స్టడీ వల్ల మెదడును మెరుగుపరిచే మందులను కూడా కనుక్కోవచ్చాన్నారు. అలా వారు కనిపెట్టిన కొన్ని ఫైండింగ్స్‌ను శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అందులో ఒకటి బ్రెయిన్ వాషింగ్ అనేది నిద్రలోని జరుగుతుంది.

సైంటిఫిక్ భాషలో బ్రెయిన్ వాషింగ్‌ను బ్రెయిన్ వేస్ట్ క్లియరెన్స్ అని కూడా అంటారు. ఒకవేళ ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే ఇది అల్జీమర్స్‌తో పాటు ఇతర న్యూరోజెనరేటివ్ వ్యాధులకు కూడా దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ బ్రెయిన్ వాషింగ్ అనేది నిద్రలోని ఎందుకు మెరుగ్గా జరుగుతుంది? మెలకువగా ఉన్నప్పుడు ఎందుకు జరగదు? అనే విషయాన్ని మాత్రం వారు కనుక్కోలేకపోయారు. బ్రెయిన్ వాషింగ్ గురించి కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు.. నిద్రపోతున్న ఎలుక మెదడును లేజర్ మైక్రోస్కోప్‌తో గమనించారు.

Advertisement

స్లీప్ సైకిల్‌ను బట్టి కూడా ఈ బ్రెయిన్ వాషింగ్ ప్రక్రియ జరుగుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ వాషింగ్ ఒకలాగా జరుగుతుందని, పూర్తిగా నిద్రలోకి వెళ్లనప్పుడు అది మరొకలాగా ఉంటుందని వారు తెలిపారు. ఇలా బ్రెయిన్ వాషింగ్ గురించి, నిద్ర సమయంలో మెదడులో జరుగుతున్న మార్పుల గురించి శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరీక్షలు చేపట్టారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి రిజల్ట్‌పై, ఇతర సమస్యలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని అన్న విషయంపై ఫోకస్ చేయనున్నారు.

యూనివర్స్‌లోని అతిపెద్ద బ్లాక్ హోల్ గుర్తింపు..

for more updates follow this link:-Bigtv

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×