E-Paper
Advertisement

OTT Movie : జీవితంపై విరక్తి పుట్టిందా? ఒక్కసారి ఈ మూవీ చూడు మావా… లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీ

OTT Movie : జీవితంపై విరక్తి పుట్టిందా? ఒక్కసారి ఈ మూవీ చూడు మావా… లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీ
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలు ఫీల్ గుడ్ స్టోరీలతో మనసును హత్తుకుంటాయి. అలాంటి సినిమాలు ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తుంటాయి. అలాంటి సందేశాలు ఇచ్చే సినిమాలు ఓటీటీలోచాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక అబ్బాయికి అంగ వైకల్యం ఉంటుంది. దానిని అధిగమిస్తూ ముందుకు వెళ్లాలనే అతని తపన అందరి చేత కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా చైనాలో ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. ఫీల్ గుడ్ సోషల్ మెసేజ్ అంటే ఇష్ట పడేవాళ్ల్లు, లైఫ్ లో కష్టాలతో పోరాడేవాళ్లు, ముఖ్యంగా జీవితంపై విరక్తి పుట్టిన వాళ్ళు ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి. నిజానికి ఇలాంటి అద్భుతమైన సినిమాలు రేర్ గా వస్తుంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘బిగ్ వరల్డ్’ 2024లో విడుదలైన చైనా కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా. యాంగ్ లీనా దర్శకత్వంలో, జాక్సన్ ఈ, డయానా లిన్, జియాంగ్ చిన్‌చిన్ ముఖ్య పాత్రల్లో నటించారు. 37వ టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి ఆడియెన్స్ అవార్డ్ గెలుచుకున్న ఈ సినిమా, చైనాలో మొట్టమొదటి యాక్సెసిబిలిటీ ప్రమోట్ చేసే ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది. ఐయండిబిలో 7.3/10 రేటింగ్ తో ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లియు అనే యువకుడికి సెరిబ్రల్ పాల్సీ అనే జబ్బు ఉంటుంది. దీని వల్ల శారీరక కదలికు ఇబ్బందిగా ఉంటుంది. లియుకి చిన్నతనం నుండే నడవడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ, అతని మేధస్సు మాత్రం పదునుగా ఉంటుంది. అతను టీచర్ కావాలని కలలు కంటాడు. కానీ అతని తల్లి అతన్ని అతి జాగ్రత్తగా, ప్రపంచానికి దూరంగా ఇంట్లోనే ఉంచడానికి ప్రయత్నిస్తుంది. దీని వల్ల లియు సమాజంతో కలవకుండా ఒంటరిగా పెరుగుతాడు. ఈ ఒంటరితనం నుండి బయటపడటానికి, తన కంటూ ఒక లైఫ్ ని ఏర్పరచుకోవడానికి అతను చేసే ప్రయత్నాలతో ఈ కథ ఒక ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది.

Read Also : మంత్రగత్తె వల్ల ముప్పు… చేతబడితో భయపెట్టే సిరీస్… హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్

Advertisement

లియు జీవితంలో అతని అమ్మమ్మ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆమె తన మనవడిని సాధారణ జీవితం గడపమని, తన కలలను నెరవేర్చుకోమని ప్రోత్సహిస్తుంది. అమ్మమ్మ అండర్ లో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అమ్మమ్మ మ్యూజిక్ బృందంలో ఒక డ్రమ్మర్ గా చేరుతాడు. ఈ ప్రయాణంలో అతను తన శారీరక వైకల్యాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ముందుకు వెళ్తాడు. ఈ సినిమా కేవలం వైకల్యం గురించి మాత్రమే కాకుండా, పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చనే బలమైన సందేశాన్ని ఇస్తుంది. చివరికి లియు ఎలాంటి లైఫ్ ని లీడ్ చేస్తాడనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

 

 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×