E-Paper
Advertisement

Brain Development:-బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు అదే ముఖ్య కారణం..

Brain Development:-బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు అదే ముఖ్య కారణం..
Advertisement

Brain Development:- శరీరం మాత్రమే కాదు.. మెదడు పెరగాలన్నా కూడా సరైన సమయంలో, సరైన న్యూట్రిషన్స్ దానికి అందాల్సిందే. అలా అందని సమయంలో ఎన్నో మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ మానసిక ఇబ్బందులు అనేవి పలు ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి. అంతే కాకుండా సరైన పోషణలు అందని మెదడు ఎదగకుండా అలాగే ఉండిపోతాయని శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఒక యాసిడ్ లోపం ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందన్నారు.

యామినో యాసిడ్స్ అనేవి బ్రెయిన్ ఎదుగుదలకు చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకవేళ ఇవి సరైన మోతాదులో మెదడుకు అందకపోతే.. ఎలుకల్లో, మనుషుల్లో దీర్ఘకాల సమస్యలను సృష్టిస్తాయని బయటపెట్టారు. బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది ఒక ప్రక్రియలాగా జరుగుతుంది. జీన్స్ అనేది ఈ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ను కనిపెడుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో న్యూరాన్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోతే.. ఎన్నో న్యూరాలాజికల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Advertisement

బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో జీన్స్ అనేవి ముఖ్య పాత్ర పోషించినా.. పోషకాహార లోపం, మాల్‌న్యూట్రిషన్ అనేవి కూడా దాని పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. అయినా కూడా ఈ న్యూట్రిషన్స్ అనేవి బ్రెయిన్‌పై చూపించే ప్రభావం ఏంటని క్షుణ్ణంగా సమాచారం ఇంకా తెలియలేదు. అందుకే పలువురు శాస్త్రవేత్తలు కలిసి ఈ కోణంలో పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ముందుగా వారు ఎలుక మెదడుతో ఒక న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించారు. అదే సమయంలో వారికి యామినో యాసిడ్స్ అనేవి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు ముఖ్యమని తెలిసింది.

యామినో యాసిడ్స్ సరైన మోతాదులో లేకపోవడం అనేది పుట్టుక నుండే బ్రెయిన్ డెవలప్‌మెంట్‌పై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని వల్ల మైక్రోసెఫలీ అనే మెదడు వ్యాధి వస్తుందని వారు గమనించారు. మైక్రోసెఫలీ అంటే బ్రెయిన్ సైజ్ పెరగకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోవడం. ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే మనుషుల్లో ఆటిజం లక్షణాలు కూడా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే యామినో యాసిడ్స్ కోసం మెటాబొలైట్స్ సాయం తీసుకోవాలని వారు కనిపెట్టారు.

Advertisement

మెటాబొలైట్స్ అనేవి పలు రకాల పోషకాహారాల్లో దొరుకుతాయి. మెదడుకు కావాల్సిన యామినో యాసిడ్స్ అనేవి ఈ మెటాబొలైట్స్ ద్వారానే దక్కుతాయి. కానీ వీటిని శరీరం తనంతటా తానుగా తయారు చేయలేదని, ఆహారం ద్వారానే మెటాబొలైట్స్ శరీరంలోకి వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మెటాబొలైట్సే లార్జ్ న్యూట్రల్ యామినో యాసిడ్స్ (ఎల్ఎన్ఏఏ)కు కారణమవుతాయి. అందుకే చిన్నప్పటి నుండి పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్ విషయంలో జాగ్రత్తలు వహించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పేపర్ బాక్సుల్లో ఫరెవర్ కెమికల్స్..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×