E-Paper
Advertisement

Biological Weapons:ఏఐతో ఆయుధాల తయారీ.. శాస్త్రవేత్తల హెచ్చరిక..

Biological Weapons:ఏఐతో ఆయుధాల తయారీ.. శాస్త్రవేత్తల హెచ్చరిక..
Advertisement

Biological Weapons:ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో ఎన్ని లాభాలు ఉన్నా కూడా.. అది మనిషి మెదడులాగా ఏది చేస్తే కరెక్ట్.. ఏది చేస్తే తప్పు.. అనే విషయాలను ఆలోచించలేదు. ఈ విషయాన్నే చాలామంది సైబర్ క్రిమినల్స్ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. మనిషి ఇచ్చే సూచనలపై మాత్రమే పనిచేసే కృత్రిమ మేధస్సుకు ఆ పని చేయాలా వద్దా అని ఆలోచించే సామర్ధ్యం ఉండదు కాబట్టి.. కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకరి కళను దొంగలించిడం, స్టూడెంట్స్‌కు ఎగ్జామ్స్‌లో చీటింగ్ కొట్టడానికి సహాయం చేయడం.. లాంటివి ఏఐతో ఇప్పటికే సాధ్యమవుతున్నాయి. ఇలాంటి వాటి గురించి శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. ఇప్పుడు మరో విషయంపై వారు హెచ్చరికలు జారీచేశారు. ఏఐ సాయంతో బయోలాజికల్, కెమికల్ ఆయుధాల తయారీ సాధ్యమని వారు తేల్చారు. దీనికోసం ఎంతోమంది ఏఐను తప్పుగా ఉపయోగించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

యుద్ధరంగంలో ఉపయోగపడే ఆయుధాలను తయారు చేయడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించవచ్చని ఆర్టిఫిషియల్ టెక్నాలజీపై పనిచేసిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏఐను సులువుగా తమ సూచనలను పాటించేలాగా చేయవచ్చా లేదా అన్న అంశంపై ఇంకా క్షుణ్ణంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐను తప్పుగా ఉపయోగించాలి అనుకునేవారు సులువుగా దానిని కంట్రోల్ చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను కంట్రోల్ చేయడం స్విచ్ వేసినంత ఈజీ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మంచి కోసం ఉపయోగించాల్సిన ఈ టెక్నాలజీని చెడుకోసం ఉపయోగించడం పెద్ద కష్టమేమి కాదని వారు తేల్చారు. శాస్త్రవేత్తలు.. ఏఐను తయారు చేయడంలో ఉపయోగించిన ఎన్నో పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని.. అవన్నీ ఉపయోగించి వాటిని తమవైపు తిప్పుకోవడం క్షణాల్లో పని అని వారు బయటపెట్టారు. అందుకే ఏఐ కేవలం మంచికే ఉపయోగపడేలా వారు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×