E-Paper
Advertisement

Space Effects on Human Brain : అంతరిక్ష ప్రయాణం.. మానవ మెదడుపై ప్రభావం..

Space Effects on Human Brain : అంతరిక్ష ప్రయాణం.. మానవ మెదడుపై ప్రభావం..
Advertisement
Space Effects Human Brain

Space Effects on Human Brain : ఈరోజుల్లో చాలామందికి స్పేస్‌కు వెళ్లాలనే ఆశ ఎక్కువయిపోయింది. అంతే కాకుండా స్పేస్ టూరిజం విషయంలో ప్రభుత్వాలు సైతం సహకరిస్తుండడంతో చాలామంది రానున్న పదేళ్లలో అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది ఆస్ట్రానాట్స్ కూడా స్పేస్ ప్రయాణం చేసి.. అక్కడ కొన్నిరోజులు ఉండి సక్సెస్‌ఫుల్‌గా వారి పరిశోధనలు చేసి తిరిగొచ్చారు. కానీ అంతరిక్ష ప్రయాణం అనేది మానవ మెదడుకు మంచిది కాదని శాస్త్రవేత్తలు తాజాగా ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

స్పేస్‌లో గ్రావిటీ అనేది ఉండదు. అది ముఖ్యంగా మానవ శరీరానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మైక్రోగ్రావిటీ పరిస్థితులు మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని తెలిపారు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడం కోసం నాసా ముందుకొచ్చింది. ఇప్పటివరకు నాసా నుండి, ఐఎస్ఎస్ నుండి స్పేస్‌కు వెళ్లి ఆరు నెలలకు పైగా అక్కడే ఉన్నవారి మెదడులో మార్పులను వారు గమనించామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ముఖ్యంగా సెరిబ్రోస్పైనల్ ఫ్యూయిడ్‌లో మార్పులను గమనించినట్టుగా తెలిపారు.

Advertisement

సెరిబ్రోస్పైనల్ ఫ్యూయిడ్‌లో అనేది మెదడు నుండి వెన్నుముక వరకు చేరుకునే ఒక ఫ్లూయిడ్. ఇది మెదడుకు కవచంగా పనిచేస్తుంది. దాదాపు 30 ఆస్ట్రానాట్స్‌పై పరిశోధనలు చేసిన తర్వాత.. స్పేస్ ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు మూడేళ్లు పట్టిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. స్పేస్ మెషీనల్లలో ఎక్కువగా పాల్గొన్నవారు కోలుకోవడానికి మరికాస్త ఎక్కువ సమయమే పడుతుందని అన్నారు. ఒకవేళ వారు ఒక మెషీన్ తర్వాత ఒక మెషీన్‌లో పాల్గొంటూ ఉంటే మాత్రం మెదడుపై పడే ప్రభావం ఊహాతీతం అని తెలిపారు.

ప్రస్తుతం స్పేస్ ట్రావెల్ అనేది ఆస్ట్రానాట్స్ మెదడుపై స్పష్టంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇంకా తెలియలేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఎక్కువకాలం వీరిని గమనిస్తూ ఉంటేనే దీని గురించి తెలుసుకోవడం సాధ్యమన్నారు. మెదడుపై ఇలాంటి ప్రభావం పడడానికి స్పేస్‌లో గ్రావిటీ లేకపోవడమే ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సైకలాజికల్‌గా కూడా మనిషి మెదడుపై మాత్రమే కాకుండా శరీరంపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు కూడా వారు ఎదుర్కునే అవకాశం ఉంటుందని బయటపెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×