E-Paper
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 538 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 538 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
Advertisement

UPSC Recruitment 2026: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 06/2026 ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న 538 గ్రూప్-A, గ్రూప్-B గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఏవియేషన్, డిఫెన్స్, ఫోరెన్సిక్ సైన్స్, అగ్రికల్చర్,మైన్స్,లా, ఎడ్యుకేషన్ వంటి 30 కి పైగా రంగాలలో ఈ నియామకాలు జరుగుతున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు యూపీఎస్సీ అఫీషియల్ ORA పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ  రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, అప్లికేషన్ ఫీజుకు సంబంధించి మరిన్ని వివరాలు.

యూపీఎస్సీ నోటిఫికేషన్ 06/2026 పూర్తి వివరాలు:

Advertisement

వివిధ రకాల పోస్టులు, ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 538 పర్మనెంట్ పోస్టులను సెలెక్షన్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ (12 పోస్టులు), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (6 పోస్టులు), మినిస్ట్రీ ఆఫ్ MSME కింద అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (50 పోస్టులు) వంటి కీలకమైన ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా సివిల్ ఏవియేషన్ లో ఆపరేషన్స్ ఆఫీసర్ (19 పోస్టులు), ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ (15 పోస్టులు),మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో వివిధ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు, వయోపరిమితి:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి పోస్టును బట్టి వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. ఇంజనీరింగ్ (B.E/B.Tech), మాస్టర్స్ డిగ్రీ (M.Sc/MCA), లా (LLB/LLM) చేసిన అభ్యర్థులు వారి వారి విభాగాలను బట్టి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కొన్ని సీనియర్ పోస్టులకు (ఉదాహరణకు ప్రొఫెసర్, రీజినల్ డైరెక్టర్) ఎక్స్‌పీరియన్స్ అవసరం కాగా, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ వంటి కొన్ని పోస్టులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. గరిష్ట వయోపరిమితి విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీకి 30 నుంచి 50 సంవత్సరాల మధ్య (పోస్టును బట్టి) ఉంటుంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు లభిస్తుంది.

Advertisement

అప్లికేషన్ ఫీజు, జీతం వివరాలు:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడం వల్ల ఇందులో జీతాలు ఎక్కువగానే ఉంటాయి. 7వ వేతన సంఘం (7th CPC) ప్రకారం ఈ పోస్టులకు పే లెవెల్-6 నుంచి పే లెవెల్-14 వరకు జీతం లభిస్తుంది. అంటే బేసిక్ పే శ్రేణి రూ. 44,900 నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 2,17,100 వరకు ఉంటుంది. వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా అందుతాయి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే.. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ (General/OBC/EWS)పురుష అభ్యర్థులకు కేవలం రూ. 25 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. మహిళలు,ఎస్సీ,ఎస్టీ, వ్యాంగులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు..వీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా?

అర్హత కలిగిన అభ్యర్థులు యూపీఎస్సీ అఫీషియల్ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ పోర్టల్ సందర్శించి.. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్లు జూన్ 13నుంచి ప్రారంభం కాగా, అప్లై చేయడానికి చివరి తేదీ జులై 3(సాయంత్రం 6:00 గంటల వరకు)గా నిర్ణయించారు. అభ్యర్థులు తమ ఫోటో, సిగ్నేచర్, విద్యార్హత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి, రూ.25ఫీజును నెట్ బ్యాంకింగ్, కార్డ్స్ లేదా యూపీఐ ద్వారా చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×