// // TG SSC Supplementary Results 2026: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మార్క్స్ మెమో లింక్ ఇదిగో! -->
E-Paper
Advertisement

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మార్క్స్ మెమో లింక్ ఇదిగో!

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మార్క్స్ మెమో లింక్ ఇదిగో!
Advertisement

TG SSC Supplementary Results 2026: తెలంగాణలో టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ అందరికీ అదిరిపోయే అప్‌డేట్. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు 2026’ నేడు అంటే జూన్ 25న అఫీషియల్‌గా రిలీజ్ అయ్యాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Telangana) రిజల్ట్స్‌ను తన అఫీషియల్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ లేదా రోల్ నంబర్ ఉపయోగించి రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ టెన్త్ క్లాస్ మెయిన్ బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గత ఏప్రిల్ 29న విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ రెగ్యులర్ పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 95.15 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే.. ఆ సమయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారికి, లేదా తమ మార్కులను మరింత ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ కోసం బోర్డు వారు జూన్ నెలలో ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు.

Advertisement

మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోండిలా..
మీ సప్లిమెంటరీ మార్క్స్ మెమోను ఎలాంటి ఇబ్బంది లేకుండా  సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా తెలంగాణ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in లోకి లాగిన్ అవ్వండి. హోమ్‌పేజీ ఓపెన్ కాగానే అక్కడ మీకు హైలైట్ అవుతూ కనిపిస్తున్న ‘TS SSC Supplementary Result 2026’ అనే లింక్‌ను వెతికి దానిపై క్లిక్ చేయండి. ఆ వెంటనే మీ స్క్రీన్ మీద ఒక కొత్త లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇచ్చిన ఖాళీ బాక్స్‌లో మీ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రోల్ నంబర్ లేదా హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. వివరాలన్నీ కరెక్ట్‌గా టైప్ చేశాక కింద ఉన్న సబ్మిట్ బటన్‌పై ప్రెస్ చేయండి. అంతే స్క్రీన్ పై రిజల్ట్ కనిపిస్తుంది. వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×