// // Mahanadi Coalfields: మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.51వేల జీతం, విద్యార్హతలు ఇవే.. -->
E-Paper
Advertisement

Mahanadi Coalfields: మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.51వేల జీతం, విద్యార్హతలు ఇవే..

Mahanadi Coalfields: మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.51వేల జీతం, విద్యార్హతలు ఇవే..
Advertisement

కోల్ ఇండియా లిమిటెడ్ అత్యంత కీలకమైన అనుబంధ విభాగం మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 667 పోస్టుల భర్తీ కోసం తాజాగా అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహిస్తామని సంస్థ స్పష్టం చేసింది. మైనింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 667 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా మైనింగ్ సిర్దార్ పోస్టులు 448 ఉన్నాయి. జూనియర్ ఓవర్‌మ్యాన్ విభాగంలో 192 పోస్టులు కేటాయించారు. సర్వేయర్ విభాగానికి 24 పోస్టులు ఉండగా టెక్నీషియన్ పాథాలజీలో 2, అలాగే ట్రాన్స్‌లేటర్ కేటగిరీలో ఒక్క పోస్టు ఖాళీ ఉంది.

Advertisement

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారీ వేతనాలు అందనున్నాయి. సర్వేయర్ పోస్టుకు గరిష్టంగా నెలకు రూ.51,103 జీతం లభిస్తుంది. మిగిలిన పోస్టులకు సైతం రూ.41,966 నుంచి రూ.47,330 వరకు వేతనం చెల్లిస్తారు.

Advertisement

వయస్సు:

అభ్యర్థుల వయోపరిమితి విషయానికి వస్తే 2026 ఏప్రిల్ 6 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ అలాగే ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో సడలింపు ఉంటుంది. ఓబీసీ (NCL) అభ్యర్థులకు మూడేళ్ల పాటు మినహాయింపు కల్పించారు.

విద్యార్హత: 

విద్యార్హతలను పరిశీలిస్తే పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా లేదంటే డిగ్రీ పాసై ఉండాలి. కొన్ని పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు డీజీఎంఎస్ సర్టిఫికేట్ లేదా గ్యాస్ టెస్టింగ్ వంటి ప్రత్యేక సర్టిఫికెట్స్ తప్పనిసరి అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: 

ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సెక్షన్ ‘A’ కింద జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 మార్కులు ఉంటాయి. సెక్షన్ ‘B’ లో అభ్యర్థికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పై 80 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం లేకపోవడం అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు ఫీజుగా జనరల్ అలాగే ఓబీసీ అభ్యర్థులు రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ అలాగే ఎస్టీ సహా మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

అర్హత ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 16 మార్చి 2026 ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 06 ఏప్రిల్ 2026 రాత్రి 11:50 గంటల వరకు సమయం ఉంది.

అర్హత గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్లో చెక్ చేసుకోవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://mahanadicoal.in

ALSO READ: Intermediate Exams 2026: ఇంటర్ పరీక్షలు షురూ.. తెలంగాణలో 10 లక్షల మంది విద్యార్థుల బిగ్ ఫైట్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×