// //
Bank of Baroda: సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా(BANK OF BARODA) ముంబయి ట్రెజరీ విభాగంలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ముంబై ట్రెజరీ విభాగంలో కీ మేనేజ్ మెంట్ పర్సనల్ ఫర్ డెబిట్ క్యాపిటల్ మార్కెట్(DCM) డెస్క్ పోస్టులకు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను నింపేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూపేద్దాం.
ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య: 2
ఇందులో కీ మేనేజ్ మెంట్ పర్సనల్ డెబిట్ క్యాపిటల్ మార్కెట్ డెస్క్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1 నాటికి 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.25 లక్షల జీతం కల్పిస్తారు.
ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 600 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఉంటుంది. వీరు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 4
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in/career/current-opportunities
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అవకాశం మళ్లీ రాదు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పించనున్నారు. దరఖాస్తుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: Indian Army Jobs: బీటెక్ పాసైతే చాలు.. ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. జీతం రూ.2,50,000
ముఖ్యమైనవి:
దరఖాస్తుకు లాస్ట్ డేట్: 2025 ఫిబ్రవరి 4
జీతం: ఏడాదికి రూ.25,00,000
ఉద్యోగాల సంఖ్య: 2