// // IOCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐవోసీఎల్‌లో 473 అప్రెంటిస్ పోస్టులు -->
E-Paper
Advertisement

IOCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐవోసీఎల్‌లో 473 అప్రెంటిస్ పోస్టులు

IOCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐవోసీఎల్‌లో 473 అప్రెంటిస్ పోస్టులు
Advertisement

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. వెస్ట్రన్ రీజియన్ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 473 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 473

Advertisement

ఈ నోటిఫికేషన్‌లో ప్రధానంగా టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులతో పాటు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్ వంటి పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. వెస్ట్రన్ రీజియన్ పరిధిలోకి వచ్చే మహారాష్ట్రలో అత్యధికంగా 194 ఖాళీలు ఉన్నాయి. గుజరాత్‌లో 121 పోస్టులు, మధ్యప్రదేశ్‌లో 82, ఛత్తీస్‌గఢ్‌లో 40 ఖాళీలు ఉన్నాయి. అలాగే గోవాలో 16, దాద్రా నగర్ హవేలీ & డామన్ దియు ప్రాంతాల్లో 20 పోస్టులను కేటాయించారు.

విద్యార్హత:

Advertisement

మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి టెక్నికల్ విభాగాల్లోనూ అప్రెంటిస్ శిక్షణ పొందవచ్చు. విద్యార్హతల విషయానికి వస్తే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో టెన్త్, ఐటిఐ, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం మార్కుల్లో కొంత మినహాయింపు లభిస్తుంది.

వయస్సు:

వయోపరిమితికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. అభ్యర్థులు 2026 మార్చి 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం:

ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా ఉండనుంది. అభ్యర్థులు తమ విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించే అవకాశం లేదు.

ఆసక్తి గల అభ్యర్థులు 2026 మార్చి 11 నుండి ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 2026 మార్చి 26 గా నిర్ణయించారు.

గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.iocl.com

ALSO READ: Indian Navy Recruitment: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు, పూర్తి వివరాలివే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×