// // IOCL Recruitment: ఐఓసీఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. డిగ్రీ, బీటెక్ పాసైతే చాలు భయ్యా, దరఖాస్తకు లాస్ట్ డేట్ ఇదే.. -->
E-Paper
Advertisement

IOCL Recruitment: ఐఓసీఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. డిగ్రీ, బీటెక్ పాసైతే చాలు భయ్యా, దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే..

IOCL Recruitment: ఐఓసీఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. డిగ్రీ, బీటెక్ పాసైతే చాలు భయ్యా, దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే..
Advertisement

భారత ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అస్సాంలోని బొంగైగావ్ రిఫైనరీలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 88 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు.. పోస్టులు.. 

Advertisement

ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగాల్లో శిక్షణ ఇస్తారు. విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి:

ట్రేడ్ అప్రెంటిస్ – అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్): 39 పోస్టులు

Advertisement

ట్రేడ్ అప్రెంటిస్ (బాయిలర్) – మెకానికల్: 16 పోస్టులు

టెక్నీషియన్ అప్రెంటిస్ – కెమికల్: 12 పోస్టులు

టెక్నీషియన్ అప్రెంటిస్ – మెకానికల్: 11 పోస్టులు

టెక్నీషియన్ అప్రెంటిస్ – ఇన్స్ట్రుమెంటేషన్: 10 పోస్టులు

విద్యార్హత.. 

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ (B.Sc), బీఈ (B.E), బీటెక్‌ (B.Tech), ఎంబీఏ (MBA) లేదా సీఏ (CA) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం మార్కుల్లో సడలింపు ఉంటుంది.

వయస్సు.. 

వయస్సు విషయానికి వస్తే.. 2026 జనవరి 31 నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ.. 

ఈ పోస్టులకు అభ్యర్థులను అర్హత పరీక్షలో (Qualifying Examination) సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నిర్దేశిత కాలపరిమితిలో శిక్షణ ఇస్తూజజ నిబంధనల ప్రకారం స్టైపెండ్ చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం.. 

ఆసక్తి గల అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఫిబ్రవరి 7, 2026న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 20, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరని సంస్థ స్పష్టం చేసింది. అర్హత గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఐఓసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://iocl.com/apprenticeships

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×