// // Indian Army Jobs-2026: ఆర్మీలో మహిళలకు ఉద్యోగాలు, ట్రైనింగ్‌లో జీతం 56 వేలు -->
E-Paper
Advertisement

Indian Army Jobs-2026: ఆర్మీలో మహిళలకు ఉద్యోగాల నోటిఫికేషన్.. ట్రైనింగ్‌లో జీతం 56 వేలు పైమాటే, ఇంకెందుకు ఆలస్యం

Indian Army Jobs-2026: ఆర్మీలో మహిళలకు ఉద్యోగాల నోటిఫికేషన్..  ట్రైనింగ్‌లో జీతం 56 వేలు పైమాటే, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Indian Army Jobs-2026: ఈ మధ్యకాలంలో రక్షణ రంగంలో మహిళలకు అవకాశాలు వెల్లువెత్తు తున్నాయి.  ఇంజనీరింగ్ లేకుంటే డిగ్రీ ఉండే చాలు.  అవకాశాలు అంది పుచ్చుకోవచ్చు.  దీనికితోడు కాస్త టాలెంట్ ఉంటే చాలు, ఆపై ఉద్యోగం మీ సొంతం. జీతం కూడా ఉహించిన స్థాయిలో ఉంటుంది.

ఆర్మీలో మహిళలకు ఉద్యోగాల నోటిఫికేషన్

Advertisement

తాజాగా 67వ షార్ట్ సర్వీసు కమిషన్ టెక్నికల్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అవివాహిత మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. B.Tech/BE ఉన్న మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు 06-01-2026 నుంచి 04-02-2026 తో ముగియనుంది.

అభ్యర్థులు నేరుగా ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్, joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఉద్యోగాల కోసం మొత్తం 30 ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అన్నింటినీ మహిళలకు కేటాయించారు.

Advertisement

ట్రైనింగ్‌లో జీతం 56 వేలు పైమాటే

తొలుత అభ్యర్థుల షార్ట్ లిస్టు ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఉంటుంది. చివరకు మెడికల్ టెస్టు ఉంటుంది. అందులో సక్సెస్ అయినవారికి మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపిక అయినవారిని ఫలితాలు మార్చి ఫస్ట్ వీక్‌లో వెల్లడికానున్నాయి. అందులో సెలక్ట్ అయిన వారికి బీహార్‌లోని గయాలో ట్రైనింగ్ ఉంటుంది.

49 వారాల పాటు ట్రైనింగ్ ఉంటుంది. అంటే అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు అన్నమాట. ట్రైనింగ్ సమయంలో జీతం 56 వేలు పైగానే ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం లభించనుంది. ఎంతకాలం చేయాలనేది ఎంపికైన అభ్యర్థులపై ఆధారపడి ఉంటుంది.  కనీసం 10 ఏళ్లు సర్వీసులో ఉండాలి.

ALSO READ: ఎస్బీఐలో 1146 ఉద్యోగాల.. డిగ్రీ పాసైతే చాలు, లైఫ్‌లో సెటిల్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×