// // Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు -->
E-Paper
Advertisement

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
Advertisement

Indian Army Jobs: దేశ సేవ చేయాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారత సైన్యం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్ విభాగంలో 379 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు, మహిళలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన వివరాలు:
పోస్టుల సంఖ్య: మొత్తం 379 పోస్టులు. ఇందులో పురుషులకు 350, మహిళలకు 29 పోస్టులు ఉన్నాయి.

Advertisement

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. భారత సాయుధ బలగాల విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది భార్యలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Advertisement

జీతం: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 56,100 స్టైఫెండ్ లభిస్తుంది. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. అప్పుడు నెలవారీ జీతం సుమారు రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది.

షార్ట్ లిస్టింగ్: అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు.

ఎస్.ఎస్.బి. ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఇందులో స్క్రీనింగ్, సైకలాజికల్ అసెస్‌మెంట్, గ్రూప్ టాస్క్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి.

మెడికల్ టెస్ట్: ఎస్.ఎస్.బి. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో శిక్షణ ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ అయిన joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×