// // IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు భయ్యా.. ఈ జాబ్ కొడితే గోల్డెన్ లైఫ్ -->
E-Paper
Advertisement

IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు భయ్యా.. ఈ జాబ్ కొడితే గోల్డెన్ లైఫ్

IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు భయ్యా.. ఈ జాబ్ కొడితే గోల్డెన్ లైఫ్
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) భారీ శుభవార్త చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో భారీగా ఖాళీలను భర్తీ చసేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 1,300 పోస్టులతో అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ ‘ఓ’ విభాగంలో 1,100 పోస్టులు కేటాయించగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’ విభాగంలో 200 పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరటనిస్తూ హైదరాబాద్ జోన్ పరిధిలో 65 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

హైదరాబాద్ జోన్‌లో: 65 వెకెన్సీలు

విద్యార్హత:  జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే జోన్ ప్రాంతీయ భాషపై పట్టు కలిగి ఉండటం తప్పనిసరి.

Advertisement

అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’ పోస్టులకు మాత్రం డిగ్రీతో పాటు ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల వయస్సు మార్చి 1, 2026 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.

సెలక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగనుంది. ఆన్‌లైన్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.6.14 లక్షల నుండి రూ.6.50 లక్షల వరకు ఆకర్షణీయమైన పే స్కేల్ లభిస్తుంది.

దరఖాస్తుకు చివరి తేది:  ఆసక్తి కలిగిన వారు మార్చి 19వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

నోట్: దరఖాస్తుకు 2 రోజులే గడువు

దరఖాస్తు ఫీజు:  జనరల్ అభ్యర్థులకు రూ.1050 ఫీజు ఉండగా ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ.250 మాత్రమే ఉంటుంది.

ఎగ్జామ్ సెంటర్స్: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 12న రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.idbi.bank.in/

ALSO READ: Samsung Affordable Phones: శాంసంగ్ టాప్ 3 బడ్జెట్ ఫోన్స్.. రూ.11000 కంటే తక్కువ ధరలో బెస్ట్ ఇవే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×