// // NAFED Recruitment: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్.. ఈ అర్హతలు ఉంటే సరిపోతుంది.. -->
E-Paper
Advertisement

NAFED Recruitment: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్.. ఈ అర్హతలు ఉంటే సరిపోతుంది..

NAFED Recruitment: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్.. ఈ అర్హతలు ఉంటే సరిపోతుంది..
Advertisement

NAFED Recruitment: నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ), ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎంఏ, బీకామ్, ఎంబీఏ(ఫైనాన్స్‌), మాస్టర్స్‌(బీఏ)లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(నాఫెడ్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత గల అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

ఢిల్లీలోని నేషనల్‌ అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(NAFED) ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 28 న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

Advertisement

ఢిల్లీలోని నేషనల్‌ అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పది ఉద్యోగాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 10

Advertisement

షనల్‌ అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

ఇందులో డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్), అసిస్టెంట్ మేనేజర్ (లీగల్), అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఉద్యోగాలు వెకెన్సీ వారీగా.. చూసినట్లయితే..

డిప్యూటీ మేనేజర్: 4 ఉద్యోగాలు

డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్): 4 ఉద్యోగాలు

అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 1 వెకెన్సీ

అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 1 వెకెన్సీ ఉంది.

దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థలు ఫిబ్రవరి 28 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా పన్నెండు రోజుల సమయం మాత్రమే ఉంది.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ), ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎంఏ, బీకామ్, ఎంబీఏ(ఫైనాన్స్‌), మాస్టర్స్‌(బీఏ)లో పాసై ఉంటే ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణ లోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని వయస్సును నిర్ధారించారు. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి 40 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి 35 ఏళ్ల వయస్సు ఉండాలి.

వేతనం: ఉద్యోగానిిక ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కల్పించనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి అయితే నెలకు రూ.47,600 నుంచి రూ.1,51,100 ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి అయితే నెలకు రూ.53,100 నుంచి రూ.1,67,800 వేతనం ఉంటుంది.

దరఖాస్తు ప్ర్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో అయిపోయాక ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తారు. అందులో ఉన్నవారిని ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి

అఫీషియల్ వెబ్ సైట్: https://www.nafed-india.com/current-openings

ALSO READ: Minister Sridhar Babu: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 30వేల మందికి ఉద్యోగాలు..

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 10

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 28

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×