E-Paper
Advertisement

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే ఛాన్స్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే ఛాన్స్
Advertisement

Central Bank of India Recruitment 2026: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 22 లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు. ప్రభుత్వ బ్యాంకులో చేరి మంచి ఎక్స్‌పీరియన్స్ సంపాదించాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం.

పోస్టుల వివరాలు , ఖాళీలు:
మొత్తం పోస్టులు: 4,500

Advertisement

పోస్టు పేరు: అప్రెంటిస్

పనిచేయాల్సిన కాలం: నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం నిర్దేశిత కాలం పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో స్థిరపడటానికి మంచి వెయిటేజీ లభిస్తుంది.

Advertisement

అర్హతలు:
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

స్థానిక భాష: అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో.. అక్కడ మాట్లాడే స్థానిక భాష (ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల వారికీ తెలుగు) రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

వయోపరిమితి:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తించే అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, PwBD అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

స్టైపండ్:
అప్రెంటిస్‌షిప్ పీరియడ్‌లో ఎంపికైన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం నెలకు నిర్ణీత మొత్తంలో స్టైపెండ్ చెల్లిస్తారు. మెట్రో నగరాలు, అర్బన్, సెమీ-అర్బన్, రూరల్ బ్రాంచ్‌ల ఆధారంగా ఈ స్టైపెండ్ అమౌంట్ మారుతుంది. సాధారణంగా ఇది రూ. 15,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం:
ఈ పోస్టుల భర్తీకి అభ్యర్థులను ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామ్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ పరీక్ష: ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ బ్యాంకింగ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మెరిట్ సాధించిన వారికి స్థానిక భాషా పరీక్ష నిర్వహించి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రకటిస్తారు.

అప్లికేషన్ :
అర్హత ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.in ద్వారా జూన్ 22 సాయంత్రం లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×