// // BSF Jobs: బీఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, భారీ శాలరీ -->
E-Paper
Advertisement

BSF Jobs: బీఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, భారీ శాలరీ

BSF Jobs: బీఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, భారీ శాలరీ
Advertisement

BSF Jobs: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. టెన్త్ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. నెలకు రూ.21,700- రూ.69,100 వరకు వేతనం ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

నోట్: దరఖాస్తుకు ఇంకా 3 రోజులే గడువు

Advertisement

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నుంచి పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 2025 ఏడాదికి సంబంధించి గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్‌ కింద స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) 391 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన ఆసక్తి కలిగిన పురుషులు, మహిళ క్రీడాకారులు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 04 వరకు దరఖాస్తులను చేసుకోండి

మొత్తం వెకెన్సీ వివరాలు: 391 పోస్టులు

Advertisement

క్రీడా విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్ తదితర విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు

స్పోర్ట్స్‌ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ): మొత్తం ఖాళీలు: 391

పురుషులు: 197 పోస్టులు

మహిళలు: 194 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (టెన్త్‌) లేదా తత్సమాన విద్యార్హతతో పాటు స్పోర్ట్స్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులై ఉంటే సరిపోతుంది. 2023 నవంబర్ 4 నుంచి 2025 నవంబర్ 4 వరకు జాతీయ ఆర్ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారు లేదా పాల్గొన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2025 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు  ఉంటుంది.

జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), మెరిట్ లిస్ట్‌ (స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా), ధ్రువపత్రాల పరిశీల, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు:  జనరల్, ఓబీసీ(పురుషులు)లకు రూ.159 ఫీజు ఉంటుది. ఎస్సీ/ఎస్టీ/మహిళలా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయంపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 16

దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 4

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: rectt.bsf.gov.in

ALDO READ: RRC NWR: రైల్వేలో 2162 ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు రూ.100 మాత్రమే.. ఇంకా ఒక్క రోజే గడువు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×