// // AP Inter Exam Changes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష విధానంలో కీలక మార్పులు -->
E-Paper
Advertisement

AP Inter Exam Changes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష విధానంలో కీలక మార్పులు

AP Inter Exam Changes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష విధానంలో కీలక మార్పులు
Advertisement

AP Inter Exam Changes: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో భారీ మార్పులు చేసింది. పబ్లిక్ పరీక్షల్లో మొత్తం పేపర్లను ఐదుకి తగ్గించింది. గతంలో ఆరు పేపర్లు ఉండగా… ఈ విద్యా సంవత్సరం నుంచి గణితం-1A, 1Bలను ఒకే పేపర్లో 100 మార్కులకు ఇస్తారు. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పేపర్లు ఇకపై 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జువాలజీ, బోటనీ పేపర్లు కూడా 85 మార్కులకు ఇస్తారు.

గత పరీక్ష విధానంలో మార్కులు

మొత్తం 6 సబ్జెక్టులు

  1. ఇంగ్లీష్-100
  2. లాంగ్వేజ్-100
  3. గణతం 1A -75
  4. గణితం 1B-75
  5. ఫిజిక్స్-60
  6. కెమిస్ట్రీ -60
  7. బోటనీ-60
  8. జువాలజీ-60

కొత్త విధానంలో మార్కులు

Advertisement

మొత్తం 5 సబ్జెక్టులు మాత్రమే

  1. ఇంగ్లీ-100 మార్కులు
  2. లాంగ్వేజ్-100 మార్కులు
  3. గణితం-100 మార్కులు
  4. ఫిజిక్స్-85 మార్కులు
  5. కెమిస్ట్రీ-85 మార్కులు
  6. బయోలజీ(బోటనీ+ జువాలజీ)-85 మార్కులు
  • ఎంపీసీ 470 మార్కులు
  • బైపీసీ 455 మార్కులు

ప్రాక్టికల్స్

ఇంటర్ సెకండియర్ లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.

ఒక్కో పరీక్షలు రెండు రోజుల గ్యాప్

Advertisement

వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్‌ బోర్డు జాతీ­య విద్యా విధానం–2020కి అనుగుణంగా ప్రథమ సంవత్సరంలో సీబీ­­ఎస్‌ఈ విధానాన్ని అమలు చేస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్‌ సిలబస్‌లో మార్పులు చేశారు. ఈ సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌ 100 మార్కులకు నిర్వహించనున్నారు. అలాగే ఒక్క మార్కు ప్రశ్నల విధానం అమలు చేయనున్నారు. ఆన్సర్ బుక్‌లెట్‌ను 32 పేజీలకు పెంచారు. ఒక్కో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా టైమ్ టేబుల్ రూపొందించారు.

Also Read: RBI Internship 2026: ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్.. నెలకు రూ.20 వేలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

పాత పద్ధతిలోనే రెండో సంవత్సరం పరీక్షలు

అయితే సెకండియర్ పరీక్షలు మాత్రం ఈ ఏడాదికి పాత విధానంలోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇంటర్ సైన్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్ లు, నాలుగు మెయిన్‌ సబ్జెక్టులతో మొత్తం 6 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు. ఆర్ట్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్ లు, మూడు మెయిన్‌ సబ్జెక్టులతో కలిపి మొత్తం 5 పేపర్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అన్ని గ్రూప్ లలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. ఒక లాంగ్వేజ్, 4 మెయిన్‌ సబ్జెక్టులు అలాగే ఇంగ్లిష్‌ తప్పనిసరి చేశారు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×